16వ ప్రవాసి భారతీయ దివస్‌: ఎన్ఆర్ఐలతో మోడీ ఇంట్రాక్షన్

16వ భారతీయ దివస్‌ సదస్సును ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రారంభించారు.కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్‌గా జరిగిన ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ… కోవిడ్ నుంచి ప్రపంచాన్నిరక్షించేందుకు భారతదేశం రెండు దేశీయ టీకాలను అభివృద్ధి చేసిందని తెలిపారు.

 Pm Modi Was Talking At The Inaugural Address Of The 16th Pravasi Bharatiya Divas-TeluguStop.com

మనం తయారు చేసిన టీకాల కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందని మోడీ వెల్లడించారు.త్వరలోనే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించనుందని చెప్పారు.

ఇదే సందర్భంగా మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లను ప్రధాని ప్రస్తావించారు.అప్పట్లో నిరుపేద దేశంగా, అక్షరాస్యత లేని దేశమని అవమానించారని.అంతేకాకుండా త్వరలోనే భారత్ విచ్చిన్నమవుతుందని చెప్పారని, అలాగే మనదేశంలో ప్రజాస్వామ్యం అసాధ్యమని అంతా భావించారని మోడీ గుర్తుచేశారు.కానీ ఇప్పుడు ప్రపంచంలో ప్రజాస్వామ్యం బలంగా, శక్తిమంతంగా, చురుగ్గా ఉందంటే.

అది భారత్‌లోనే అని ప్రధాని వెల్లడించారు.

Telugu Indianday, Masks, Corona, Democracy, Indian Vaccine, Kovid, Mortality, Pp

ప్రపంచాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న కరోనాను ఎదుర్కోవడంలో భారత్‌ ముందంజలో ఉందని మోదీ గుర్తుచేశారు.ఈ విపత్కర సమయంలో భారతీయులందరూ కలిసికట్టుగా ఉన్నారని ప్రశంసించారు.అత్యధిక రివకరీ రేటు.

అతి తక్కువ మరణాల రేటు ఉన్న దేశాల్లో మనది కూడా ఒకటని తెలిపారు.ఇప్పుడు భారత్‌.

ప్రపంచ ఔషధ కేంద్రంగా మారిందని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న దేశాలకు మనం మందులతో పాటు అవసరమైన సామాగ్రిని సరఫరా చేస్తున్నామని మోడీ చెప్పారు.కోవిడ్ వెలుగు చూసిన కొత్తలో పీపీఈ కిట్లు, ఎన్‌ 95 మాస్క్‌లు, వెంటిలేటర్లు తదితర సామగ్రిని దిగుమతి చేసుకునేవాళ్లమన్నారు.

కానీ ఇప్పుడు దేశీయంగానే తయారుచేసుకునే స్థాయికి భారత్ చేరుకుందని ప్రధాని తెలిపారు.
విదేశాల్లో ఉన్న ప్రవాసి భారతీయులకు ప్రభుత్వం, దేశం ఎప్పుడూ అండగా ఉంటుందని మోడీ హామీ ఇచ్చారు.

కరోనా సమయంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న సుమారు 45 లక్షల మందిని వందే భారత్‌ మిషన్‌ ద్వారా స్వదేశానికి తీసుకొచ్చామని ప్రధాని గుర్తుచేశారు.ప్రవాసి భారతీయ దివస్‌ సదస్సును ఈసారి ‘ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగస్వామ్యం’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు.

రెండు ప్లీనరీలుగా నిర్వహించే ఈ సదస్సు చివరిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తారు.ఈ సందర్భంగా 2020-21 సంవత్సరానికి గాను ప్రవాస భారతీయ సమ్మాన్‌ అవార్డు విజేతల పేర్లను ప్రకటిస్తారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube