వరి పంటకు నష్టం కలిగించే ఎర్రచార తెగులను నివారించే సస్యరక్షక పద్ధతులు..!

వరి పంటకు( rice crop ) నష్టం కలిగించే ఎర్రచార తెగులు( Red rot ) ఓ ఫంగస్ ద్వారా వ్యాప్తి చెందుతాయి.వరి మొక్కలు పునరుత్పాదక దశకు చేరుకున్నప్పుడు ఈ ఎర్రచారల తెగుల లక్షణాలు బయటపడతాయి.

 Plant Protection Methods To Prevent Red Rot That Damages The Rice Crop , Rice Cr-TeluguStop.com

పొలంలో అధికంగా నత్రజని( Nitrogen ) వాడిన, వాతావరణం లో తేమశాతం పెరిగిన, వాతావరణం లో అధిక ఉష్ణోగ్రత ఏర్పడిన ఈ తెగుల వ్యాప్తి విపరీతంగా పెరుగుతుంది.ఈ తెగులు ఆకు లోపలి కణజాలంలో విషాన్ని చిమ్మడం వల్ల ఆకుపై ఎరుపు రంగులో చారలు ఏర్పడతాయి.

వరి మొక్కలపై ఆకుపచ్చ రంగులో లేత నారింజ రంగులో చిన్నటి మచ్చలు చారల వల్లే ఏర్పడితే వాటిని ఎర్రచార తెగులుగా నిర్ధారించుకోవాలి.ఒక్క యొక్క ఆకు పెరుగుతూ ఉంటే ఈ చారలు కూడా పెరుగుతూ నష్టాన్ని కలిగిస్తాయి.

తెగులు నిరోధక విత్తనాలను( Pest resistant seeds ) మాత్రమే ఎంపిక చేసుకొని సాగు చేయాలి.తెగులు వచ్చాక వివిధ రకాల రసాయన పిచికారి మందులపై ఆధారపడి కంటే సాగుకు ముందే మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకుంటే చాలా వరకు చీడపీడల, తెగుళ్ల బెడద తగ్గినట్టే.ఆ తరువాత పంట పొలంలో మొక్కల మధ్య కాస్త ఎక్కువ దూరం ఉంటే సూర్యరశ్మి, గాలి బాగా తగిలి పంట కు తెగుళ్ల బెడద తగ్గుతుంది.నత్రజని మిశ్రమ ఎరువులు అధికంగా ఉపయోగించకూడదు.

వరి పంటలో ఈ తెగులు నివారణకు సేంద్రీయ పద్ధతిలో అరికట్టడం చాలా కష్టం.కాబట్టి పంట మొక్కలు కంకులు వచ్చే సమయంలో ఈ తెగులను గుర్తించి వెంటనే రసాయన పిచికారి మందులు ఉపయోగించి అరికట్టాలి.థియోఫనేట్ మీథైల్( Thiophanate methyl ) గల పిచికారి మందులను మొక్కలు పూర్తిగా తడిచే విధంగా పిచికారి చేసి ఈ తెగులను నివారించుకుంటే అధిక దిగుబడి పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube