జగన్ డిల్లీ టూర్.. బీజేపీకే లాభమా ?

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి.నిన్నటికి నిన్న బీజేపీ తమతో ఉండకపోవచ్చని, తమకు ఎవరి అండ అవసరం లేదని చెప్పిన సి‌ఎం జగన్( CM jagan ) హటాత్తుగా నిన్న డిల్లీ పయనం అయ్యారు.

 Jagan's Delhi Tour.. Is Bjp Profitable?jagan, Amit Shah, Narendra Modi , Bjp Par-TeluguStop.com

ఈ డిల్లీ టూర్ లో కేంద్ర పెద్దలు అమిత్ షా( Amit Shah ), ప్రధాని మోడి తో పాటు నిర్మల సీతారామన్ వంటి వారిని కలిశారు జగన్మోహన్ రెడ్డి.అయితే పెండింగ్ లో ఉన్న నిధుల విధుదల చేయాలని అదిగేందుకే జగన్ డిల్లీ టూర్ అని వైసీపీ చెబుతోంది.

అయితే ఈ టూర్ వెనుక ఇంకో కారణం కూడా ఉందంటూ పోలిటికల్ సర్కిల్స్ లో గుసగుసలు నడుస్తున్నాయి.

Telugu Amit Shah, Ap, Bjp, Jagan, Narendra Modi, Midhun Reddy, Ys Jagan-Politics

ఇటీవల ఓ జాతీయ సర్వే సంస్థ వెల్లడించిన ఫలితాలలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన వైసీపీదే విజయం అని తెలపడంతో ఇంకా ఎన్నికల విషయంలో ఆలస్యం చేయకూడని ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు నిర్వహించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని.వీటిపైనే కేంద్ర పెద్దలతో చర్చలు జరిపారని వార్తలు వచ్చాయి.ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా ముందస్తు ఎన్నికలపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో.

మరోసారి ముందస్తు ఎన్నికలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ తప్పలేదు.ముందస్తు ఎన్నికలకు వెళ్లబోమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ( P.V.Midhun Reddy )స్పష్టం చేశారు.అయితే మరి కేంద్ర పెద్దలతో జగన్ బేటీ ఏ అంశంపై జరిగిందనేది ఆసక్తికరం.

Telugu Amit Shah, Ap, Bjp, Jagan, Narendra Modi, Midhun Reddy, Ys Jagan-Politics

పెండింగ్ లో ఉన్న నిధుల విషయమై కూడా గట్టిగానే కేంద్ర పెద్దలముందు జగన్ విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.అయితే విభజన హామీల పరంగా పెండింగ్ లో ఉన్న 20 వేల కోట్ల నిధులను విధుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు తెలుస్తోంది.అయితే నిన్నమొన్నటి వరకు వైసీపీపై ఘాటు విమర్శలతో విరుచుకుపడిన బీజేపీ సర్కార్.

ఇంత సడన్ గా నిధుల విడుదలపై క్లారిటీ ఇవ్వడం ఏంటి అనే ప్రశ్న చాలమందిలో ఉంది.అయితే ఇందులో బీజేపీ స్వార్థం కూడా ఉందనేది కొంతమంది అతివాదులు చెబుతున్నా మాట.ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజల్లో బీజేపీ( BJP )పై ఉన్న వ్యతిరేకతను కొంతలో కొంతైనా తగ్గించి.ప్రచారంలో నిధుల విడుదలను గట్టిగా ప్రస్తావించేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కేంద్రం నిధుల విధుదల చేసిందని కొందరు చెబుతున్నారు.

ఇందులో నిజం కూడా లేకపోలేదు.మొత్తానికి జగన్ డిల్లీ టూర్.

ఎంతో కొంత బీజేపీకి లాభం చేకూర్చే విధంగానే ఉందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube