వామ్మో, బెంగళూరులో ఈ చిన్న గది అద్దె అక్షరాలా రూ.12,000.. అడ్వాన్స్ రూ.50 వేలు!

ట్రాఫిక్, వర్షం, ఖరీదైన అద్దె కారణంగా బెంగళూరు( Bangalore ) వాసులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యలతో బెంగళూరు ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.

 Picture Of Small Room In Bengaluru With Rs 12000 Rent Goes Viral Details, Bengal-TeluguStop.com

బెంగళూరులో విచిత్రమైన డిమాండ్‌లు చేసే భూస్వాములకు, హెడ్‌లైన్స్‌లో నిలిచే ట్రాఫిక్ జామ్‌లకు కొదవలేదు.ఈ సిటీలో ఒక ఇల్లు లేదా రూమ్ అద్దెకు( Rent ) తీసుకోవాలంటే మామూలు కష్టం కాదు.

ఒక్కోసారి డబ్బులున్నా సరిపోదు, మార్కులు బాగా తెచ్చుకోవాల్సి ఉంటుంది.ఇక్కడ నెలకు రూ.50 వేల శాలరీలు సంపాదించేవారు కూడా ఇల్లు అద్దెకి తీసుకోవడం కూడా కష్టం.తాజాగా అక్కడ ఎంత భారీగా అద్దెలు ఉంటాయో తెలిపే ఒక సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

బెంగళూరులోని రూ.12,000 అద్దెకు లభించే అతి చిన్న గది( Small Room ) చిత్రాన్ని రెడిట్‌లో ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు.ఆ రూమ్ చాలా చిన్నది, అందులో మంచం మాత్రమే సరిపోతుంది.సింపుల్‌గా చెప్పాలంటే అది బాత్ రూమ్ కంటే పెద్దగా లేనే లేదు.ఆ రూమ్ మహదేవపురలో( Mahadevapura ) ఉంది.దానిని ‘వన్ రూమ్ వన్ కిచెన్’గా కొందరు ప్రజలు అభివర్ణించారు.ఈ గది కోసం నెలకు రూ.12,000 చాలా ఎక్కువ అనుకుంటే దీనికోసం ముందుగా రూ.50 వేలు డిపాజిట్ కూడా చేయాలంట.

Telugu Bedroom, Bengaluru, Bizarre, Expensive, Broker, Reddit, Rs, Servant Quart

ఈ చిన్న గది చిత్రాన్ని పోస్ట్ చేసిన వ్యక్తి “బెడ్‌ సరిపోతే చాలు దీనిని ఒక బెడ్ బెడ్‌రూమ్ అనేస్తారా?” అన్నట్లు క్యాప్షన్‌లో రాశాడు.ఈ పోస్ట్ రెడిట్‌లో ( Reddit ) బాగా వైరల్ అయింది.నెటిజన్లు దీనిపై రకరకాలుగా రియాక్ట్ అయ్యారు.

కొంతమంది దీనిని తమాషాగా భావించగా, మరికొందరు ఆశ్చర్యపోయారు.ఒక వ్యక్తి రిప్లై ఇస్తూ “ఇది చాలా రోజుల పని తర్వాత ప్రజలు రెస్ట్ తీసుకోవడానికి అత్యాధునిక ఎయిర్ వెంట్‌తో కూడిన లగ్జరీ అపార్ట్‌మెంట్” అని చమత్కరించారు.

Telugu Bedroom, Bengaluru, Bizarre, Expensive, Broker, Reddit, Rs, Servant Quart

ఆ గది మరుగుదొడ్డి అని, దానిని బెడ్‌రూమ్‌గా మార్చారని మరో వ్యక్తి వ్యాఖ్యానించారు.ఇది అసలు రూమే కాదు ఒక పరుపుతో బాత్రూం ఇచ్చినట్లే ఉంది అని ఇంకొక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.నో బ్రోకర్‌ వెబ్‌సైట్‌లో లిస్ట్‌ చేసిన వివరాల ప్రకారం ఈ 1 రూమ్ 1 కిచెన్ ఫ్లాట్‌లో స్టవ్, మినీ ఫ్రిడ్జ్, వాటర్ ప్యూరిఫైయర్, రెండు చిన్న అల్మారాలు ఉన్నాయి.ఫ్లాట్‌లో సర్వెంట్ క్వార్టర్ ఉందని కూడా యజమాని లిస్టింగ్‌లో పేర్కొన్నాడు.

యజమాని చిన్న ఫ్లాట్ మరిన్ని చిత్రాలను వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube