జులై లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ హిట్టేనా..! 'బ్రో' పరిస్థితి ఏమిటి?

మన టాలీవుడ్ హీరోలకు కొన్ని సెంటిమెంట్స్ బాగా కలిసి వస్తాయి.అలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) కూడా కొన్ని సెంటిమెంట్స్ బాగా కలిసొచ్చింది.ఆయన కెరీర్ లో మైల్ స్టోన్స్ గా నిల్చిన ఎన్నో సినిమాలు సమ్మర్ లో విడుదలైనవే.‘ఖుషి’ ,’గబ్బర్ సింగ్’ మరియు ‘జల్సా’ వంటి సినిమాలు సమ్మర్ కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించాయి.అయితే అదే సమ్మర్ లో ఆయనకీ జానీ, బంగారం, సర్దార్ గబ్బర్ సింగ్ మరియు కాటమరాయుడు వంటి ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఇచ్చిన సినిమాలు మాత్రం సమ్మర్ లోనే పడ్డాయి.

 Pawan Kalyan July Month Sentiment Movies Tholiprema Tammudu Bro Details, Pawan K-TeluguStop.com

Telugu Bro, Gabbar Singh, July, Kushi, Pawan Kalyan, Sai Dharam Tej, Tammudu, Th

ఇక సమ్మర్ తర్వాత ఆయనకీ బాగా కలిసొచ్చిన నెల జులై.పవన్ కళ్యాణ్ సినిమాల్లో అభిమానులకు మరియు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయినా సినిమాలు తొలిప్రేమ( Tholiprema ) మరియు తమ్ముడు.( Tammudu ) ఈ రెండు సినిమాలు ఆయన కెరీర్ లో క్లాసిక్స్ గా నిలిచిపోయాయి.

ఇప్పటికీ ఈ సినిమాలను టీవీ లో వేసినప్పుడు మంచి టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుంటుంది.ఈ రెండు సినిమాలు కూడా జులై నెలలోనే విడుదల కావడం విశేషం.

Telugu Bro, Gabbar Singh, July, Kushi, Pawan Kalyan, Sai Dharam Tej, Tammudu, Th

తొలిప్రేమ చిత్రం 1998 వ సంవత్సరం జులై 24 వ తేదీన విడుదల కాగా, తమ్ముడు చిత్రం 1999 వ సంవత్సరం జులై 15 వ తారీఖున విడుదల అయ్యింది.తొలిప్రేమ కి ముందు పవన్ కళ్యాణ్ ఒక మామూలు హీరో, కేవలం చిరంజీవి తమ్ముడిగా మాత్రమే ఇండస్ట్రీ లో గుర్తింపు ఉండేది.కానీ ఎప్పుడైతే ‘తొలిప్రేమ’ సినిమా విడుదలైందో, అప్పటి నుండి పవన్ కళ్యాణ్ జాతకం మారిపోయింది.రాత్రికి రాత్రి స్టార్ హీరో అయిపోయాడు.ఆరోజుల్లోనే ఈ చిత్రం సుమారుగా 9 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించింది అంటే, ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.ఇక ఈ సినిమా తర్వాత విడుదలైన ‘తమ్ముడు’ చిత్రం ‘తొలిప్రేమ’ కి మించి హిట్ అయ్యింది.

ఈ సినిమా ని ఎన్ని జెనెరేషన్స్ అయినా ఇష్టపడుతారు.అంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఈ సినిమా అప్పట్లోనే సుమారుగా 13 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించింది.

ఈ రెండు సినిమాలు జులై లోనే విడుదల అయ్యాయి.ఇక పవన్ కళ్యాణ్ లేటెస్ట్ చిత్రం ‘బ్రో’ కూడా జులై 28 వ తారీఖున విడుదల కాబోతుంది.

ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ రీసెంట్ గానే విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటుగా ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.

తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘వినోదయ్యా చిత్తం’ అనే చిత్రానికి ఇది రీమేక్.డైరెక్ట్ ఓటీటీ లో విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

కేవలం స్టోరీ లేని తీసుకొని పూర్తిగా మార్చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.పవన్ కళ్యాణ్ కి జులై సెంటిమెంట్ ఎలా అయితే కలిసొచ్చిందో, ఈ బ్రో చిత్రం ద్వారా కూడా ఆ సెంటిమెంట్ ని కొనసాగిస్తాడా లేదా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube