పాలమూరు మహిళల గిన్నిస్ బుక్ రికార్డ్.. ఎందులో అంటే.?

ఆడవాళ్లు తలుచుకుంటే సాధించలేనిది ఏది ఉండదని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పాలమూరు మహిళలు సాధించి చూపించారు.ఏకంగా ఇక్కడి మహిళలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కించుకుని అందరికి ఆదర్శంగా నిలిచారు.

 Palampur Womens Guinness Book Of Records Why, Palamuru Women's, New Record, Guni-TeluguStop.com

కేవలం 10 రోజుల సమయంలో లక్షా 24 వేల మంది మహిళలు కలిసి 2 కోట్ల 8 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి వరల్డ్ రికార్డు సాధించి చూపించారు.కేవలం 10 రోజుల్లో 2.08 కోట్ల విత్తన బంతులు తయారు చేయడం అంటే మాములు విషయం కాదనే చెప్పాలి.కానీ మహిళలు దేని మీద అయిన శ్రద్ద పెట్టారంటే ఆ పని పూర్తి చేయనిదే నిదరపోరు.

పట్టు వదలని విక్రమార్కుడిలా అతి కొద్ది కాలంలోనే రెండు కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే కాకుండా వాటితో అతి పెద్ద సెంటెన్స్ కూడా తయారు చేసి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు.జిల్లా కేంద్రం అయిన రైల్వే కమ్యూనిటీ హాల్ లో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్ లార్జెస్ట్ సీడ్ బాల్ సెంటెన్స్ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో మహిళలు తయారు చేసిన సీడ్ బాల్స్ కు గిన్నిస్ బుక్‌ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు కల్పిస్తూ ఆ సంస్థ ప్రతినిధి రిషినాథ్ అధికారికంగా ధృవీకరించారించడం కూడా జరిగింది.

Telugu Palamuru Womens, Latest-Latest News - Telugu

సీడ్ బాల్స్ తో అతి పెద్ద సెంటెన్స్ తయారు చేయడం అంటే మాములు విషయం కాదు.కానీ ఈ మహిళలు మాత్రం నిరంతరం కష్టపడి మరి దీన్ని సాధించి చూపించారు.లక్షా 24 వేల మంది మహిళలు కలిసి ఐకమత్యంగా ఉండి కేవలం 10 రోజుల సమయంలో సాధించిన ఘనత ఇది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బోయినపల్లి సంతోష్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, పాలమూరు మహిళా సంఘాల సభ్యులు ఆ మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మహిళలు సాదించిన ఘనతను చూసి అందరు వీళ్ళని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఇప్పుడు ఈ మహిళలు అందరికి ఆదర్శంగా నిలిచారనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube