ఆరోజు కొండపై గౌతమి ప్రాణాలే పోయేవట.. ఎవరు కాపాడారంటే..?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా నటిగా గౌతమి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

వైజాగ్ లో ఇంజినీరింగ్ చదివే సమయంలో గౌతమికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.

తెలుగులో దయామయుడు అనే సినిమాతో గౌతమి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా తమిళంలో గురు శిష్యన్ అనే సినిమాతో గౌతమి ఎంట్రీ ఇచ్చారు.గౌతమి చేసిన పాత్రలు నటిగా ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టడం గమనార్హం.

అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో గౌతమికి కొండపై ప్రాణాపాయం తప్పిందట.ఏళు సుత్తిన కోటే అనే కన్నడ మూవీ కొరకు గౌతమి కుద్రేముఖ్ అనే ప్రాంతానికి వెళ్లారు.

అంబరీష్ ఆ సినిమాలోని హీరో పాత్రలో నటించారు.స్క్రిప్ట్ ప్రకారం గౌతమి అంబరీష్ ను పిలుస్తూ కొండపై నుంచి కిందికి దిగాల్సి ఉంటుంది.

Advertisement

గౌతమి కొండపై నుంచి కిందకు దిగే సమయంలో కొండపై ఉండే ముళ్లు, పిఛ్కి మొక్కల వల్ల ఆమె దిగడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది.చీరలో ఉన్న గౌతమి గబగబా దిగుతున్న సమయంలో ఆమె కాలికి ఒక రాయి తగిలింది.

అదే సమయంలో చీర కుచ్చిళ్లు గౌతమి కాళ్ల కింద పడటంతో గౌతమి ముందుకు తూలగ సినిమాకు పని చేస్తున్న ఒక వ్యక్తి వెంటనే వేగంగా స్పందించి ఆమె కొండపై నుంచి కింద పడకుండా కాపాడారు.యూనిట్ సభ్యుడు సరైన సమయానికి స్పందించకపోయి ఉంటే మాత్రం గౌతమి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లేది.

గౌతమి తెలుగుతో పోలిస్తే తమిళంలోనే ఎక్కువ సంఖ్యలో నటించారు.సెకండ్ ఇన్నింగ్స్ లో గౌతమి గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఇస్తుండటం గమనార్హం.ఈ మధ్య కాలంలో గౌతమి తెలుగులో నటించిన మనమంతా సినిమా ఆమెకు నటిగా మంచి పేరును తెచ్చిపెట్టింది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు