భారత్‌పై పన్నిన కుట్రను బయటపెట్టిన పాకిస్థాన్ యూట్యూబర్‌?

సమాజానికి మంచి చేసే విషయంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు పాత్ర నేడు చాలా కీలకంగా మారిందని చెప్పుకోవాలి.ఈ క్రమంలోనే ఓ పాకిస్థాన్ యూట్యూబర్‌( Pakistan Youtuber ) పాక్ భారత్‌పై పన్నిన కుట్రను బట్టబయలు చేసాడు.

 Pakistani Youtuber Who Revealed Conspiracy Against India Details, Pakistani Yout-TeluguStop.com

అవును, పాకిస్థాన్ కి చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్ ‘షాన్ అలీ’( Shaan Ali ) అనే వ్యక్తిని యూట్యూబ్ లో చాలామంది పాలో అవుతుంటారు.ఈయన్ని ఐఎస్ఐ ( ISI ) పిలిచి పాకిస్థాన్లో ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి స్పందించమని కోరింది.

ఈ క్రమంలో మత విధ్వంసం, ఘర్షణ అనే రెండు విషయాల ప్రజలపైన రుద్ది ఆ తప్పుని భారత్ చేస్తున్న కుట్రగా అభివర్ణించాలని చెప్పినట్టు చెప్పిందట.

Telugu India, Pakistan Isi, Influencer, Terrorism-Latest News - Telugu

పాకిస్థాన్ ప్రస్తుత గడ్డు పరిస్థితులలో ఇప్పుడు యువత తీవ్రవాదం వైపు వెళ్లడానికి ముందుకు రావడం లేదని సమాచారం.గతంలో తీవ్ర వాద సంస్థల్లో చేరితే డబ్బులు అందేవి.దీంతో కుటుంబానికి ఏదో రకంగా సహాయం చేయాలని భావించేవాళ్లు.

కానీ ఇపుడు అలాంటి పరిస్థితి అక్కడ లేదు.ఇక తీవ్రవాద శిక్షణలో లేదా ఏదైనా ఎటాకింగ్ లో పోతే ఆ యువకుడి కుటుంబానికి రూ.5లక్షలు లేదా రూ.10 లక్షలు ఇచ్చేవారు.దీంతో ఆయా కుటుంబాలు గడిచిపోయేవి.కానీ పాకిస్థాన్ దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు.దాంతో తీవ్రవాదం వైపు కుర్రాళ్లను రప్పించడం వారి వల్ల కావడం లేదు.గతంలో యువతకు డబ్బులు ఆశ చూపి శత్రుదేశం ఇండియా అని చెప్పించి వారికి ఉగ్రవాద శిక్షణ ఇప్పించి భారత్ అంటే ద్వేషం కలిగేలా చేసే వారు.

Telugu India, Pakistan Isi, Influencer, Terrorism-Latest News - Telugu

ఇప్పుడు వారి పప్పులు ఉడకడం లేవు.అక్కడి యువత కూడా ప్రస్తుతం రియలైజ్ అయ్యే పరిస్థితులలో ఉన్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం యూట్యూబర్ షాన్ అలీ బయటపెట్టిన విషయం ద్వారా పాకిస్థాన్ వక్రబుద్ది మరోసారి బయటపడింది.భారత్ పై అసహ్యం కలిగేలా వీడియోలు చేయాలని, పాక్ యువతను ఇన్‌ఫ్లుయెన్స్ చేసేలా మాట్లాడమని ఐఎస్ఐ అతగాడికి చెప్పిందని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

ఇలా ఐఎస్ఐ దారుణాలు చేస్తుంటే పాక్ ప్రభుత్వం ఏం చేస్తోందని దుయ్యబట్టారు.దీన్ని బట్టి చూస్తే పాక్ ప్రభుత్వం ఏ పరిపాలన చేస్తోంది అర్ధం అవుతోందని, తద్వారానే దేశ స్థితిగతులు దిగజారిపోయాయని చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube