గూగుల్‌ను చాట్ జీపీటీ దెబ్బ తీయబోతోందా? ఇకపై గూగుల్ అనేది పూర్తిగా నిరుపయోగంగా మారనుందా? అంటే అవుననే అంటున్నారు టెక్ నిపుణులు.పూర్తిగా కృత్రిమ మేధాతో అభివృద్ధి చేసిన చాట్ జీపీటీ ఇంటర్నెట్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
అన్ని ప్రశ్నలకు చాలా కరెక్టు, పర్ఫెక్ట్ ఆన్సర్స్ ను ఇస్తూ ప్రజల సమయాన్ని చాలా సేవ్ చేస్తోంది.
చాట్ జీపీటీ విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే గూగుల్ కంపెనీకి భయం పట్టుకుంది.గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన ఆల్ఫాబెట్ కంపెనీకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ ప్రధాన ఆదాయ వనరు.చాట్ జీపీటీ ఫౌండర్స్ ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థకు చెందిన బింగ్ సెర్చ్ ఇంజిన్ తో ఒక ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదే కనుక జరిగితే గూగుల్ పతనం తప్పకపోవచ్చు.ఇదే విషయంపై స్పందిస్తూ జీమెయిల్ ఇన్వెంటర్ పాల్ బుచ్చెయట్ చాట్ జీపీటీతో గూగుల్ కు భారీ నష్టం తప్పదని, ఇందుకు రెండు లేదా మూడేళ్లు సమయం పట్టొచ్చని అంచనా వేశారు.
గతంలో గూగుల్ ఎల్లో పేజెస్ ను ఎలా దెబ్బ తీసిందో ఇప్పుడు గూగుల్ పరిస్థితి కూడా అలాగే అవ్వొచ్చు అని అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఇకపోతే ChatGPT అనేది హ్యూమన్-లైక్ టెక్స్ట్ రూపొందించగల లాంగ్వేజ్ మోడల్.అయితే, ఇది గూగుల్ లేదా మరే ఇతర శోధన ఇంజిన్‌ను భర్తీ చేయడానికి తీసుకు రాలేదని దానికి అదే చెబుతోంది.గూగుల్, ఇతర సెర్చ్ ఇంజన్‌లు యూజర్లకు సంబంధిత, కచ్చితమైన సెర్చ్ ఫలితాలను అందించడానికి ఇండెక్స్, ర్యాంకింగ్ అల్గారిథమ్‌లతో సహా అనేక రకాల టెక్నాలజీలను ఉపయోగిస్తాయి.
చాట్ జీపీటీ ఈ విధులను నిర్వహించడానికి తీసుకు రాలేదు.అయితే చాట్‌బాట్‌లు, వర్చువల్ అసిస్టెంట్లు, భాషా అనువాదం వంటి వివిధ అప్లికేషన్‌లలో టెక్స్ట్-ఆధారిత కంటెంట్, ప్రతిస్పందనలను రూపొందించడానికి ChatGPTని ఉపయోగించవచ్చు.
చాట్ జీపీటీ పూర్తిగా గూగుల్‌ని భర్తీ చేస్తుందా లేదా అనేది కాలమే చెబుతుంది.