కొనసాగుతున్న భూ సర్వే...పరిశీలించిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్

నల్లగొండ జిల్లా: తిరుమలగిరి (సాగర్) మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలపై పైలేట్ ప్రాజెక్ట్ లో భాగంగా నేతాపురం గ్రామశివారులో గట్టుమీద తండా,ఎల్లాపురం గ్రామ శివారులో సుంకిశాల తండాలో కొనసాగుతున్న భూ సర్వేను శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండు గ్రామాలు గతంలో నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణంలో భాగంగా ముంపు గ్రామాలన్నారు.

ఈ గ్రామాలలో రైతులకు 1975లో ఢీ ఫారమ్స్ ఇచ్చారని,వాటి ద్వారా రైతులు కాస్తూ కబ్జాలో ఉన్న ప్రకారంగా ఎంజాయ్మెంట్ సర్వే చేయాలని సర్వేయర్లకు సూచించారు.అదేవిధంగా గట్టుమీద తండా గిరిజన రైతులకు 223 ఎకరాలు, సుంకిశాలతండా రైతులకు 190 ఎకరాలు డి ఫామ్ పట్టాలు ఇచ్చారన్నారు.

Ongoing Land Survey Supervised By Joint Collector Srinivas, Ongoing Land Survey

పైలెట్ ప్రాజెక్టులో భాగంగా అన్ని గ్రామ శివారులో పెండింగ్ లో ఉన్న సర్వే నెంబర్లు కూడా త్వరలోనే సర్వే చేయాలన్నారు.ఫారెస్ట్ భూములకు వాటి హద్దులు ప్రకారంగా జాయింట్ అటవీ, రెవెన్యూ సర్వే కూడా చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్రహ్మణ్యం,ల్యాండ్ రికార్డ్ ఏడి శ్రీనివాస్,డిఐ రమణయ్య,రమాకాంత్ రెడ్డి,శ్రీను,ఆర్ఐ సందీప్, కృష్ణయ్య,సర్వేయర్ విజయ్,లక్ష్మణ్,ఖదీర్,స్వప్న,వెంకటేశ్వర్లు,కాంగ్రెస్ యువ నాయకులు మేరావత్ మునినాయక్, బద్రి నాయక్,రామకృష్ణ నాయక్,శంకర్ నాయక్, సేవా నాయక్,జబ్బార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Latest Nalgonda News