యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండల పరిధిలోని కొమ్మాయిగూడం సమీపంలో అదానీ సంస్థ ఏర్పాటు చేయబోయే ఆంబూజ సిమెంట్ పరిశ్రమపై మండల వ్యాప్తంగా నిసనలు వెల్లువెత్తుతున్నాయి.శుక్రవారం కొమ్మాయిగూడెంలో ఆదానీ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా సంఘటితమై పోరాడాలని కరపత్రం విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ వేదిక మండల కన్వీనర్ జలాల పెంటయ్య మాట్లాడుతూ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా కొమ్మయిగూడెం గ్రామంలో అఖిలపక్ష కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు.
అఖిలపక్ష గ్రామ గౌరవ అధ్యక్షుడుగా గురజాల అంజిరెడ్డి, కన్వీనర్ గా బాలగోని గణేష్,కోకన్వీనర్ గా ఎర్ర కాటమయ్య,సభ్యులుగా శానకొండ వెంకటేశ్వర్లు, ఎర్ర రమేష్,మోటే మారయ్య,బుర్ర శ్రీశైలం, బెల్లి లింగస్వామి, బత్తుల సత్తయ్య,బెల్లి మల్లయ్య, మోటి నరేష్, దుర్గయ్యలను ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు ఎర్ర రవీందర్,అంతటి సత్తయ్య,సోమయ్య, రేపాక లింగస్వామి,ఆకిటి శీను,మచ్చ నరేష్,ఎర్ర శేఖర్,తీర్పాల మల్లయ్య, చింటూ,మచ్చ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.ఇదిలా ఉంటే మండల అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ కు,కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్ కు వినతి పత్రాలు సమర్పించారు.







