Prabhas Ntr : ప్రభాస్ చెప్పిన వినకుండా ఆ పని చేసి 40 కోట్లు నష్టపోయిన ఎన్టీఆర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్( Prabhas ) అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్( Ntr ) కూడా ఒకరు వీరిద్దరి మధ్య ఎంతో మంచి సాన్నిహిత్య ముందే ఇద్దరు కూడా ఒరేయ్ అరేయ్ అని పిలుచుకొని అనుబంధం ఉందని సంగతి మనకు తెలిసిందే.ఇక వీరిద్దరికీ పరిచయం సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఉందని తెలుస్తుంది.

 Ntr Lost 40 Crores Because Of Not Listening To Prabhas Words-TeluguStop.com

ఇలా వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Telugu Harish Shankar, Prabhas, Samantha, Tollywood-Movie

ఇక కొన్ని విషయాలలో వీరిద్దరూ కూడా ఒకరి నిర్ణయం మరొకరు గౌరవిస్తూ ఉంటారని చెప్పాలి.అయితే ఒక విషయంలో మాత్రం ప్రభాస్ ఎంత చెప్పినా వినకుండా ఎన్టీఆర్ చేసిన పని కారణంగా 40 కోట్ల వరకు నష్టపోయారని తెలుస్తోంది.ఎన్టీఆర్ ఏ పని చేసి అంతలా నష్టపోయారు ప్రభాస్ ఎందుకు చేయద్దని చెప్పారో అసలు ఆ పని ఏంటి అనే విషయానికి వస్తే సినిమాలలో నటించడమేనని చెప్పాలి.

Telugu Harish Shankar, Prabhas, Samantha, Tollywood-Movie

హీరో పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసిన తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) రామయ్య వస్తావయ్య( Ramayya Vasthavayya ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఘోరంగా డిజాస్టర్ అయిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమా కథతో హరీష్ శంకర్ ముందుగా ప్రభాస్ వద్దకు వెళ్లారట అప్పటికే ఆయన రెబల్ అనే సినిమాని ఇదివరకు చేసిన సినిమా కూడా ఇలాంటి తరహాలోనే ఉంది సరికొత్త కథతో వస్తే సినిమా చేద్దామని చెప్పి పంపించారట ఇలా ప్రభాస్ రిజెక్ట్ చేయడంతో డైరెక్టర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు.

Telugu Harish Shankar, Prabhas, Samantha, Tollywood-Movie

ఈ కథ వినగానే ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పేసారట ఎన్టీఆర్ ఈ సినిమాకు కమిట్ అయ్యారు అనే విషయం తెలుసుకున్న టువంటి ప్రభాస్ ఎన్టీఆర్ కి ఫోన్ చేసి.ఈ సినిమా చేయొద్దు అది వర్కౌట్ కాదు చేయనని రిజెక్ట్ చేయి అంటూ తనకు సలహా ఇచ్చారట అయితే అప్పటికే తాను దర్శక నిర్మాతలకు కమిట్మెంట్ ఇచ్చేసానని ఇక చేయక తప్పదు అంటూ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించారు.అయితే ఈ సినిమా భారీ స్థాయిలోనే నష్టాలను ఎదుర్కొంది.ఇలా ప్రభాస్ చెప్పిన మాట వినకుండా ఎన్టీఆర్ ఈ సినిమా చేయడంతో నష్టాలను మూటకట్టుకున్నారని తెలుస్తోంది.ఇక ప్రస్తుత మీ ఇద్దరి హీరోలు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా ఎంతో గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube