వృద్ధురాలి నుంచి డబ్బులు కొట్టేసిన ఎన్నారై యువకులు అరెస్ట్!

కంప్యూటర్ వైరస్ స్కామ్ ( Computer virus scam )ద్వారా మసాచుసెట్స్‌లో 78 ఏళ్ల వృద్ధురాలి( old woman ) నుంచి 1 లక్ష డాలర్లకు పైగా దొంగిలించినందుకు భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్టయ్యారు.నిందితులు నికిత్‌ ఎస్‌ యాదవ్‌ ( Nikit S Yadav )(22), రాజ్‌ విపుల్‌ పటేల్‌ ( Raj Vipul Patel )(21) కంప్యూటర్‌లోని అనవసరమైనవి వైరస్ తొలగించేందుకు బాధితురాలి నుంచి డబ్బులు డిమాండ్‌ చేశారు.

 Nri Youths Arrested For Extorting Money From Old Woman ,computer Virus Scam, El-TeluguStop.com

బాధితురాలు గత వారం తన కంప్యూటర్‌లో అవసరం లేనివి తొలగించాలని టెక్ సపోర్ట్ నంబర్‌కు కాల్ చేసింది.నిందితులు సోమవారం సాయంత్రం బాధితురాలి ఇంటికి వచ్చి డబ్బు వసూలు చేశారు.

ఆ తర్వాత పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.ఇద్దరిపై తప్పుడు నెపంతో $1,200 కంటే ఎక్కువ కుట్ర, చోరీకి పాల్పడ్డారనే అభియోగాలు మోపారు.

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ప్రకారం, యూఎస్‌లోని వృద్ధులు ప్రభుత్వ వంచన, స్వీప్‌స్టేక్‌లు, రోబోకాల్ స్కామ్‌లకు బలి అవుతున్నారు.2021లో మోసానికి గురైన 92,371 మంది వృద్ధులు ఉన్నారు, ఫలితంగా $1.7 బిలియన్ల నష్టం వాటిల్లిందని FBI తెలిపింది.సీనియర్ సిటిజన్లు మోసాలను పోలీస్ అధికారులకు నివేదించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని దర్యాప్తు బ్యూరో వెల్లడించింది.

నేషనల్ కౌన్సిల్ ఆన్ ఏజింగ్ ప్రకారం, 2020, డిసెంబర్ 31తో ముగిసిన ఐదేళ్ల కాలంలో, యూఎస్ సెనేట్ స్పెషల్ కమిటీ ఆన్ ఏజింగ్ ఫ్రాడ్ హాట్‌లైన్ దేశవ్యాప్తంగా 8,000 కంటే ఎక్కువ ఫిర్యాదులను అందుకుంది.

మసాచుసెట్స్‌లో జరిగిన సంఘటన బట్టి టెక్ సపోర్ట్ నంబర్లకి ఫోన్ చేసినప్పుడు లేదా డబ్బు అవతల వ్యక్తి అడిగినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించడం అవసరమని అర్థం చేసుకోవచ్చు.ఇక వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి.ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలతో వ్యవహరించేటప్పుడు కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల నుంచి సహాయం తీసుకోవాలి.

కాగా ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube