Rashmi Gautam: ఇంకా మేకప్ అవసరమా రష్మీ అంటూ నెటిజన్స్ ట్రోల్స్.. ఆ ఒక్క వీడియో షేర్ చేయటంతో రచ్చ రచ్చ?

ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు మేకప్ విషయంలో చాలా ట్రోల్స్ ఎదుర్కొంటారు.ఎందుకంటే మేకప్ లేకుండా వాళ్ళని చూడలేము కాబట్టి.

 Netizens Trolling Anchor Rashmi Gautam Make Up Details, Rashmi ,netizens , Troll-TeluguStop.com

పైగా మేకప్ లేకుండా వాళ్ళు పొరపాటున కూడా కనిపించరు.ఒకవేళ కనిపిస్తే మాత్రం ట్రోలర్స్ వారిని అస్సలు వదలరు.

అయినా కూడా చాలా సందర్భాలలో చాలామంది మేకప్ లేకుండా కనిపించగా వెంటనే వారిని పట్టుకొని బాగా టోల్స్ చేశారు.అయితే తాజాగా యాంకర్ రష్మీ ని కూడా బాగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇంతకు అసలు విషయం ఏంటంటే.

టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది రష్మీ గౌతమ్.

తక్కువ సమయంలో తన యాంకరింగ్ తో అందరినీ తన వైపు మలుపుకుంది.మొదట్లో ఈమె వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా కనిపించగా ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అడుగు పెట్టింది.

జబర్దస్త్ తో తన లైఫ్ టర్న్ అయింది.అంతేకాకుండా ఎంతోమంది ఫాన్స్ ను సంపాదించుకుంది.

కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోలల్లో కూడా సందడి చేసింది.పైగా వెండితెరపై కూడా అవకాశాలు అందుకోగా నటిగా తనకంటూ ఒక గుర్తింపు వచ్చింది.

అలా రెండు మూడు సినిమాలలో హీరోయిన్ గా కూడా చేసింది.ఇటీవల ఓ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఈ బ్యూటీ జబర్దస్త్ లో మరో కమెడియన్ సుడిగాలి సుధీర్ తో ఎంత రచ్చ చేసిందో చూసాం.నిజానికి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారా అన్నట్లుగా ప్రవర్తించారు.ఏ షోలో చూసిన వీరిద్దరూ కలిసి సందడి చేసేవాళ్లు.గతంలో జబర్దస్త్ వేదికపై వీరిద్దరికి ఉత్తుత్తి పెళ్లి కూడా చేసి బాగా హైలెట్ చేశారు మల్లెమాల.దీంతో ప్రేక్షకులు కూడా వీరిద్దరిని జంటగా చూడాలని తెగ ఆశపడ్డారు.

కానీ వీరిద్దరి మధ్య అటువంటిదేమీ లేదు కేవలం రేటింగు కోసం మాత్రమే అలా చేస్తున్నారు అని తెలిసింది.

అయినా కూడా తమ అభిమానులు మాత్రం.ఇప్పటికీ వీరిని ఒక కపుల్స్ లాగా చూసుకుంటున్నారు.వీరికి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది.అప్పుడప్పుడు వీరిద్దరి గురించి చాలా వార్తలు కూడా వినిపించాయి.

అయితే ఇదంతా పక్కన.తాజాగా రష్మీ కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.అందులో తను స్కిన్ కు సంబంధించిన మేకప్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ కనిపించగా అందులో తను బాగా నవ్వుతూ కనిపించింది.ఇక ఆమె నవ్వును చూసి ఏడుస్తున్నావా అంటూ ట్రోల్ చెయ్యగా మరి కొంతమంది ఈ ఆంటీ కిమేకప్ అవసరమా అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆ కామెంట్లు బాగా వైరల్ అవ్వగా.ఈ నెగటివ్ కామెంట్లకు రష్మీ ఏమని స్పందిస్తుందో చూడాలి.ప్రస్తుతం ఈ బ్యూటీ బుల్లితెరపై బాగా పరుగులు తీస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube