అత్తతో మేనల్లుడు వివాహేతర సంబంధం.. చివరకు మేనల్లుడు ఏం చేశాడంటే..?

Nephew's Extramarital Relationship With Aunt.. Finally, What Did The Nephew Do..? , Crime , Crime News , Extramarital Affiar , Police , Peddapuram , East Godavari , Murder

ఓ వ్యక్తి తన మేనత్తతో వివాహేతర సంబంధం( Extramarital Affiar ) పెట్టుకొని.చివరికి మేనత్త కుమార్తెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.

 Nephew's Extramarital Relationship With Aunt.. Finally, What Did The Nephew Do..-TeluguStop.com

ఈ హత్య ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో తీవ్ర సంచలనం లేపింది.ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పెద్దాపురంలోని కొండయ్య పేటలో నివాసం ఉండే ద్రోణ వీర్రాజు, జ్యోతి అనే దంపతులు మనస్పర్ధల కారణంగా విడిపోయి ఒంటరిగా జీవిస్తున్నారు.

జ్యోతి పట్టణ శివారులో ఉండే ఎన్టీఆర్ నగర్ లో తన తల్లి సునీతతో కలిసి జీవిస్తోంది.జ్యోతికి మానస అనే పదేళ్ల కూతురు సంతానం.

మానస తన తల్లితో పాటే ఉంది.

Telugu Godavari, Affiar, Peddapuram-Latest News - Telugu

అయితే రంగంపేట మండలం వరుసలేరు కు చెందిన బత్తిన నాని అనే యువకుడు జ్యోతి కి వరుసకు మేనల్లుడు అవుతాడు.వావి వరసలు మరిచి జ్యోతి తన మేనల్లుడు నానితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.వీరి బంధం దాదాపు ఐదేళ్లుగా సాఫీగానే సాగుతోంది.

గత కొంతకాలంగా జ్యోతి తన మేనల్లుడిని దూరం పెట్టేసింది.ఇంట్లో ఉండే తన కూతురు ఎదుగుతోందని, ఇక వివాహేతర సంబంధానికి వీడ్కోలు పలుకుదామని చెప్పడంతో తమ బంధానికి అడ్డుగా ఉండే మానసను అడ్డు తొలగించుకోవాలి అని నాని భావించాడు.

Telugu Godavari, Affiar, Peddapuram-Latest News - Telugu

ప్లాన్ ప్రకారం ఈ నెల 19వ తేదీ మానసను తన బైక్ పై ఎక్కించుకొని, కట్టమూరు పుంత రోడ్డు సమీపంలో హతమార్చాడు.కూతురు ఇంటికి రాకపోవడంతో జ్యోతి ఈనెల 20వ తేదీ పెద్దాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు( Police ) మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించగా ఆదివారం రాత్రి కట్టమూరు పుంతలో బాలిక మృతదేహం లభ్యమయింది.బాలిక మృతదేహాన్ని కుక్కలు ఈడ్చుకు రావడంతో గుర్తు పట్టలేని స్థితిలో ఉంది.

మృతదేహంపై ఉండే దుస్తుల ఆధారంగా ఆ మృతదేహం మానస( Manasa ) దేనని గుర్తించారు.సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వర్తించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.మానస ను హత్య చేసిన నాని ఫోటోను పోలీసులు విడుదల చేసి, అంతకుడిని పట్టిస్తే రూ.10 వేల పారితోషకం అందిస్తామని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube