కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్త వరవడికి శ్రీకారం

నల్లగొండ జిల్లా: నాగార్జున సాగర్ యువ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన "మేము పాలకులం కాదు సేవకులం" అనే మాటను అక్షరాల నిజం చేస్తూ ముందుకు సాగుతున్నారు.

ఎమ్మేల్యే కాగానే హోదా,దర్జా,హంగు ఆర్భాటం,ప్రొటో కాల్, పోలీస్ కాన్వాయ్ అంటూ నానా హంగామా చేసే ఎమ్మెల్యేలను మనం చూశాం.కానీ,కాంగ్రెస్ పార్టీ యువ ఎమ్మేల్యేలు వాటికి దూరంగా కామన్ మ్యాన్ లాగే ఉండాలని భావిస్తున్నారు.

Nagarjuna Sagar Mla Jaiveer Reddy Sensational Decision, Nagarjuna Sagar, Mla Jai

అందులో భాగంగానే నాగార్జున సాగర్ ఎమ్మేల్యే కుందూరు జైవీర్ రెడ్డి శనివారం తన వాహనాలకు ఇచ్చిన ఎమ్మెల్యే స్టిక్కర్లను తొలగించారు.తనకు వచ్చిన మూడు ఎమ్మెల్యే స్టిక్కర్స్ ఎక్కడా మిస్ యూస్ కాకుండా ఆ స్టిక్కర్లను రిటర్న్ చేసే యోచనలో జైవీర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం.

అలాగే తను ప్రయాణించే ప్రతి వాహనాన్ని ఫాస్ట్ ట్రాక్ తో టోల్ ప్లాజా వద్ద కామన్ పీపుల్ వెళ్లే లైన్ లోనే వెళ్లాలని సిబ్బందిని ఆదేశించారు.మరో అడుగు ముందుకేసి తన కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పేరుతో సామాన్య ప్రజలను ఎక్కడా ఇబ్బంది పెట్టొద్దంటూ ఇప్పటికే మ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

గత ఎమ్మెల్యేలకు భిన్నంగా కొత్తగా ఎన్నికైన యువ ఎమ్మేల్యే జైవీర్ రెడ్డి తీసుకుంటున్న ఆదర్శవంతమైన నిర్ణయాలు ప్రజలను ఆలోచింప చేస్తుండగా, సాగర్ నియోజకవర్గ ప్రజలు,కాంగ్రెస్స్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తండ్రి రైతు.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!
Advertisement

Latest Nalgonda News