చిరంజీవిని చూసి నాగార్జున నేర్చుకోవాలా.. కొడుకుల కెరీర్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలా?

చిరుత సినిమాతో రామ్ చరణ్( Ram Charan ) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.

 Nagarjuna Need To Focus On Akhil And Nagachaitanya Details Here Goes Viral , Nag-TeluguStop.com

వాస్తవానికి చరణ్ తొలి సినిమాకే రాజమౌళి( Rajamouli ) డైరెక్టర్ గా వ్యవహరించాల్సి ఉన్నా రాజమౌళి చరణ్ రెండో సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తానని మాటివ్వడం జరిగింది.చిరంజీవి రామ్ చరణ్ కెరీర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

చరణ్ నటించే ప్రతి సినిమా కథ తెలుసుకుని ఆ కథకు కొన్ని మార్పులు సూచించి చరణ్ మెగా పవర్ స్టార్ గా, పాన్ ఇండియా హీరోగా ఎదిగేలా చేయడంలో చిరంజీవి కృషి ఎంతో ఉంది.ఆర్.

ఆర్.ఆర్ విషయంలో కూడా చిరంజీవి కొంతమేర జోక్యం చేసుకున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఫ్లాపులు ఉన్నా ఆ ఫ్లాపులు చరణ్ మార్కెట్ పై ప్రభావం చూపలేదంటే చిరంజీవి ప్లానింగ్ కారణమని చెప్పవచ్చు.

అయితే అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) మాత్రం కొడుకుల కెరీర్ విషయంలో తప్పటడుగులు వేస్తున్నారు.కెరీర్ తొలినాళ్లలోనే నాగచైతన్యకు జోష్, దడ, బెజవాడ సినిమాలతో భారీ షాకులు తగిలాయి.క్లాస్ సినిమాలతో చైతన్యకు విజయాలు దక్కుతున్నా ఒక స్థాయిని దాటి చైతన్య ఎదగలేకపోతున్నారు.

అఖిల్ విషయానికి వస్తే కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ స్థాయి సినిమా ఒక్కటి కూడా లేదు.

అఖిల్ తో సినిమాలు తీసిన నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు మిగిలాయి.చిరంజీవిలా( Chirenjeevi ) తన అనుభవంతో నాగ్ కొడుకుల కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెడితే బాగుంటుందని చెప్పవచ్చు.నాగచైతన్య, అఖిల్ లకు స్టార్ డైరెక్టర్లను, అద్బుతమైన స్టోరీలను సెట్ చేస్తే ఈ హీరోల రేంజ్ మారుతుంది.

నాగ్ రాబోయే రోజుల్లో అయినా ఈ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube