టాలీవుడ్ హీరో నాగచైతన్య( Naga Chaitanya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చైతన్య ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కానీ సినిమాలు మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ ను సాధించలేకపోతున్నాయి.ఇది ఇలా ఉంటే త్వరలోనే నాగచైతన్య దూత ( dootha )అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లో డిసెంబర్ 1 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ ( OTT platform is Amazon Prime )లో స్ట్రీమింగ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం నాగచైతన్య బిజీ బిజీగా ఉన్నారు.
ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి స్పందించారు.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ హీరోయిన్ సమంత నటించిన ద ఫ్యామిలీ మ్యాన్ ( The Family Man )వెబ్ సిరీస్ తన ఫేవరెట్ సిరీస్ అని తెలిపాడు.ఆ సిరీస్ తనకు చాలా బాగా నచ్చిందని ఆయన అన్నారు.కాగా చైతన్య వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమంత ( Samantha )పై చైతన్యకు తగ్గలేదు అలాగే ఉంది అందుకు ఇదే సాక్ష్యం ఇంతకుమించి సాక్ష్యం కావాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే ఫ్యామిలీ మ్యాన్ సెకండ్ సీజన్‌లో సమంత కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
ఈ సిరీస్‌లో మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి, శరద్ కేల్కర్, నీరజ్ మాధవ్, షరీబ్ హష్మీ, దలీప్ తాహిల్, సన్నీ హిందూజ, శ్రేయ ధన్వంతరి పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.ఇకపోతే నాగచైతన్య ప్రస్తుతం తండేల్ ( Tandel )అనే సినిమా చేస్తున్నాడు.
ఇది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన దాదాపు 25 మంది మత్స్యకారులు బతుకుతెరువు కోసం గుజరాత్ తీర ప్రాంతంలోని వీరవల్ వద్ద చేపల వేట కొనసాగిస్తూ 2018 నవంబర్‌లో పొరపాటున పాకిస్తాన్ సముద్ర తీర అధికారులకు బందీలుగా చిక్కారు.దీంతో మత్స్యకారులు దాదాపు ఏడాదిన్నర పాటు అక్కడే బందీలయ్యారు.జైలు జీవితం అనుభవించిన వారి జీవితాలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇందులో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.ఈ సినిమా డిసెంబర్‌లో షూటింగ్ మొదలు కానుంది.డైరెక్టర్ చందూ మెండేటి దర్శకత్వం వహిస్తున్నారు.