నాగపూర్ ఎన్ఐటి క్యాంపస్ రిక్రూట్మెంట్లో సత్తాచాటిన మిర్యాలగూడ వాసి

నల్లగొండ జిల్లా:ప్రముఖ ఒరాకిల్ ఎంఎన్సీ సాఫ్ట్ వేర్ కంపెనీ ఇటీవల నాగపూర్ ఎన్ఐటిలో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని ఆయేషా తఖి( Ayesha Taqi ) సత్తా చాటింది.ఒరాకిల్ ఎంఎన్సీ సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఎంపికై,రూ.

34 లక్షల వార్షిక వేతనం అందుకోనుంది.ఆయేషాతఖి తండ్రి మహమ్మద్ నుస్రత్ అలీ మిర్యాలగూడ(Miryalaguda ) బీసీ హాస్టల్ అధికారిగా,తల్లి అజ్మతున్నిసాబేగం ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు.

Miryalaguda Student Got Job In Nagpur NIT Campus Recruitment , Ayesha Taqi, N

ఆయేషాతఖి 1 నుంచి 4 వరకు మిర్యాలగూడలోని శ్రీవిద్యోదయ పాఠశాలలో, ఐదు డాక్టర్ మువ్వా రామారావుకు చెందిన జ్యోతి స్కూల్లో,6 నుండి 8 వరకు(2014-17) నేరేడుచర్ల మండలం చిల్లేపల్లిలోని సిటీ సెంట్రల్ స్కూల్లో,9,10 తరగతులు మిర్యాలగూడ లోని ఎస్.పి.ఆర్.స్కూల్ లో (2017- 19),ఇంటర్ (2019-21) వరకు శ్రీచైతన్య కళాశాల హైదరాబాదులో విద్యనభ్యసించింది.2021 జేఈఈ మెయిన్స్ లో 99.22% 8054 ఓపెన్ కేటగిరిలో ఆల్ ఇండియా ర్యాంక్)సాధించి నీట్ నాగపూర్ లో సి.ఎస్.ఈలో చేరింది.జాన్ డీర్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఇంటర్మ్ షిప్ పూర్తి చేసి,ఒరాకిల్ ప్రాంగణ నియామాకల్లో సాఫ్ట్ వేర్ డెవలపర్ గా ఎంపికైంది.

ఈ సందర్భంగా ఆయేషాతఖి మాట్లాడుతూ తన తల్లిదండ్రులు నుస్రత్ అలీ, అజ్మతునిసాబేగంతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులైన బాబాయిలు ఇప్తేకర్అలీ, అబ్దుల్ రహీం,అబ్దుల్ కరీం, మామయ్యలు ఎండి సలీం, ఎండి కలీం,గురువుల ఆశీర్వాదంతో ఈ స్థాయికి చేరుకోవడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా సహకరించిన వారికి,గురువులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

సాప్ట్ వేర్ రంగంలో సత్తా చాటిన ఆయేషాతఖికి సీనియర్ జర్నలిస్ట్ ఎండి అస్లంతో పాటు, పలువురు అభినందనలు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
Advertisement

Latest Nalgonda News