వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) చేపట్టిన టికెట్ల కేటాయింపు వ్యవహారం ఆ పార్టీలో ఇంకా దుమారం రేపుతుం ఉంది.ఇప్పటికే విడతల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
పూర్తిస్థాయిలో జాబితాను రేపు ప్రకటించే అవకాశం ఉంది.అయితే టికెట్ల కేటాయింపులో చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
తన సన్నిహితులైన వారిని జగన్ పక్కన పెట్టారు.ఈ లిస్టులో మంత్రులు సైతం ఉన్నారు.
తాము ఆశించిన టికెట్ దక్కకపోవడంతో చాలామంది అసంతృప్తితో ఉంటున్నారు.తాజాగా ఏపీ మంత్రి, వైసిపి సీనియర్ నేత గుమ్మనూరు జయరాం( YCP senior leader Gummanur Jayaram ) అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సంచలనంగా మారింది.
వైసిపి కీలక నేతలు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రావడం లేదట.అయితే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడానికి కారణం ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా తనను తప్పించి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడమేనని జయరాం సన్నిహితులు పేర్కొంటున్నారు.
ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి జయరాం స్థానంలో తాజాగా విరూపాక్షిని నియోజకవర్గ ( Virupakshini Constituency ) సమన్వయకర్తగా జగన్ నియమించారు.జయరాం ను కర్నూలు లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించారు.ఈ పరిణామాలతో నాలుగు రోజులుగా బెంగళూరులోనే జయరాం ఉన్నారు.తర్వాత ఆలూరులో మూడు రోజులపాటు గడిపారు.ఇక ఆ తర్వాత నుంచి ఎవరికి అందుబాటులోకి రావడం లేదు.
వైసిపి ఆలూరు ఇంచార్జి విరుపాక్షి జయరాం ను కలిసేందుకు ప్రయత్నించినా , ఆయన అందుబాటులో లేరట.అయితే మంత్రి గారి అలక కు కారణం వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆలూరు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జగన్ కు చెప్పినా, కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం పై జయరాం అసంతృప్తి చెందారట.ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఎంపీ గా పోటీ చేయనని, ఆలూరు ఎమ్మెల్యే గానే పోటీ చేస్తానని చెబుతుండటంతో జయరాం విషయంలో వైసీపీలో టెన్షన్ నేలకొంది.