అమెరికాకి...భారీ వలసలు  

Migrant Caravaz What Is It And Why Does It Matter-

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలసలని ఎంతగా నియంత్రించాలని అనుకున్నా అది సాధ్యం కావడం లేదు. వలస జీవుల పిల్లల్ని వారి నుంచీ వేరు చేసి చివరికి ప్రపంచం ముందు దుర్మార్గుడిగా నిలబడినా సరే ఈ వలసలకి అడ్డుకట్ట వేయడం ట్రంప్ వల్ల అవడం లేదు. అయితే ఈ సారి ఈ వలసల తాకిడి మధ్య అమెరికా దేశమైన హోండూరన్‌ నుంచి ఈ వలసలు అధికంగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు..

అమెరికాకి...భారీ వలసలు-Migrant Caravaz What Is It And Why Does It Matter

దాదాపు 7వేల మంది గత వారం తమ అమెరికా దిశగా వలసలకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే కేవలం వారి కలలని సాకారం చేసుకోవడానికి మాత్రమే వలసలు వెళ్ళడం లేదని హోండూరన్‌ తాలూకు చెడు అనుభవాల నుంచీ పారి పోవడానికి చూస్తున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.అయితే ఈ వలసలకి ప్రపంచ దేశాలు అన్నీ సంఘీభావం తెలుపుతున్నాయ. అయితే వీరిని నిలువరించకపోతే ఆంక్షలు తప్పవని ఆయా దేశాలను ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు.

అయినా సరే ఈ వలసలు ఆగకపోవడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు