కూరగాయ పంటలలో టమాటా( Tomato ) ప్రధాన పంట.మార్కెట్లో టమాట పంటకు ఎప్పుడు ఎంత ధర ఉంటుందో చెప్పలేం.
కానీ కొన్ని సందర్భాల్లో టమాటా పంట ధర కొండేక్కుతుంది.కాబట్టి మార్కెట్ డిమాండ్ ను బట్టి అధిక విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా దఫా దఫాలుగా నాటుకొని సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చుని వ్యవసాయ క్షేత్ర నిపుణులు సూచిస్తున్నారు.
అయితే టమాటా పంట సాగు చేసే ముందు సాగు విస్తీర్ణంపై ముందుగా అవగాహన కల్పించుకుంటే వివిధ రకాల చీడపీడల, తెగుళ్ల నుండి పంటను సంరక్షించుకోవచ్చు.
టమాటా పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల విషయానికి వస్తే తామర పురుగులు కీలక పాత్ర వహించి పంటను నాశనం చేస్తాయి.ఈ తామర పురుగులు సుమారుగా ఒకటి లేదా రెండు మిల్లీమీటర్ల పొడవు వరకు పెరుగుతాయి.ఈ పురుగులు పసుపు, నలుపు రంగులలో ఉంటాయి.
ఈ పురుగులు మట్టిలో దాగి ఉండే మొక్కల అవశేషాలలో జీవించి ఉంటాయి.ఈ తామర పురుగులకు అనేక చీడపీడలు( Pests ) వాహకాలుగా కూడా ఉంటాయి.
ఈ పురుగులు పొడి మరియు వేడి వాతావరణంలో జీవిస్తాయి.గాలిలో తేమ ఉంటే ఇవి జీవించలేవు.
ఈ పురుగులు ఆశించిన టమాటా మొక్క ఆకులు రంగులు కోల్పోతాయి.ఆ తర్వాత ఆకులు ముడుచుకుపోతాయి.పంట పూత, పిందె సమయంలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆశిస్తే దిగుబడి సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది.టమాటా పంటలో అధిక దిగుబడులు ( High yields )సాధించాలంటే తెగులు నిరోధక మేలు రకం విత్తనాలను సాగుకు ఎంపిక చేసుకోవాలి.
టమాటా మొక్కల దగ్గర కలుపు మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి.ఏవైనా చీడపీడలు లేదంటే తెగుళ్లు ఆశించిన మొక్కలు కనిపిస్తే వెంటనే వాటిని తొలగించాలి.టమాట పంటకు నీటి ఎద్దడి సమస్యలు తలెత్తకుండా బాగా నీటిని అందించడంతోపాటు నత్రజని ఎరువులను అధిక మోతాదులో ఉపయోగించకూడదు.ఈ తామర పురుగులను టమాటా పొలంలో గుర్తించిన తర్వాత రసాయన పిచికారి మందులైన ఫిప్రోనిల్, ఇమిడాక్లోప్రిడ్ లలో ఏదో ఒక మందును పిచికారి చేయాలి.