బుల్లితెరపై ప్రైవేట్ ఛానెల్స్ హవా మొదలైనప్పటి నుంచి సీరియళ్ల హవా కొనసాగుతోంది.రోజురోజుకు సీరియళ్లను చూసే ప్రేక్షకుల కూడా అంతకంతకూ పెరుగుతోంది.
స్టార్ మా, జీ తెలుగు ఛానెళ్లలో ప్రసారమయ్యే కొన్ని సీరియళ్లు మంచి రేటింగ్ ను సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.నిర్మాతలు సైతం సీరియళ్లకు భారీ బడ్జెట్ కేటాయిస్తూ ఉండటంతో సీరియళ్లు మంచి క్వాలిటీతో తెరకెక్కుతున్నాయి.
అయితే సీరియళ్ల వల్ల కుటుంబాలలో చిన్నచిన్న గొడవలు చేసుకున్న సందర్భాలు సైతం ఉన్నాయి.ప్రతి సీరియల్ లో చెడుపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.ఆడవాళ్ల మధ్య గొడవలను ఎక్కువగా హైలెట్ చేస్తూ సీరియళ్లను తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం.ఆ మీమ్ లో కన్న కూతురిని ఎలా నాశనం చేయాలి అంటే కుంకుమ పువ్వు సీరియల్ చూడాలని పేర్కొన్నారు.
భర్త నుంచి భార్యను ఎలా విడదీయాలో తెలియాలంటే కార్తీకదీపం సీరియల్ చూడాలని మీమ్ లో చెప్పుకొచ్చారు.
తండ్రి నుంచి కూతురిని ఎలా విడదీయాలో చూడాలంటే కోయిలమ్మ సీరియల్ చూడాలని పని మనిషి ఇంటి కోడలు అయితే ఎలా ఏడిపించాలో తెలియాలంటే కథలో రాజకుమారి చూడాలని ఆడపడుచుని కష్టాలు పెట్టాలంటే భార్య సీరియల్ ను చూడాలని పేర్కొన్నారు.
అన్నల కోసం భర్తను జైలుకు పంపడం ఎలాగో తెలియాలంటే అగ్నిసాక్షి చూడాలని అత్తగారు కోడలిని ఎలా చంపుతుందో తెలియాలంటే లక్ష్మీ కళ్యాణం చూడాలని పేర్కొన్నారు.
కొన్ని సీరియళ్లను దర్శకనిర్మాతలు సంవత్సరాల తరబడి సాగదీస్తున్నా ప్రేక్షకులు మాత్రం వాటిని ఆదరిస్తూనే ఉన్నారు.కొన్ని సీరియళ్లు పచ్చని కుటుంబాల్లో గొడవలు పెడుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.వైరల్ అవుతున్న మీమ్ గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దపెద్ద సినిమాలు భారీ రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అవుతుంటే కొన్ని చిన్న సీరియళ్లు మాత్రం మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.