టాలీవుడ్ లెజెండరీ నటుడు మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi ) ఈ వయసులో కూడా వరుస ప్రాజెక్టులను లైన్లో పెడుతూ దూసుకెళ్తున్నారు.సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరు కుర్ర హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా వరుసగా డైరెక్టర్లకు కమిట్మెంట్స్ ఇస్తూ వాటిని ఒకదాని తర్వాత మరొక పూర్తి చేస్తూ పోతున్నాడు.
ఇక ఈ మధ్యనే భోళా శంకర్ సినిమా( Bhola Shankar )తో వచ్చి ప్లాప్ అందుకున్నాడు.దీంతో ఆ తర్వాత సినిమాలను ఆచి తూచి ఎంచుకున్నాడు.ఇటీవలే మెగాస్టార్ బర్త్ డే కానుకగా రెండు సినిమాలను ప్రకటించగా రెండింటిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి మెగాస్టార్ ప్రకటించిన సినిమాల్లో మెగా 156 ( Mega156 ) ఒకటి.
ఈ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ కూతురు తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.అయితే ఈ ప్రాజెక్ట్ నుండి అనౌన్స్ మెంట్ తర్వాత మరో అప్డేట్ రాలేదు.
మరి ఎట్టకేలకు నిన్ననే ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ ను అందించారు.ఈ సినిమా నుండి పూజా కార్యక్రమం వీడియో ఇస్తామని ప్రకటించగా తాజాగా ఆ వీడియోను రిలీజ్ చేసారు.
ఇక ఇక్కడ ఊహించని సర్ప్రైజ్ ఏంటంటే ఈ పూజా కార్యక్రమం వీడియో మాత్రమే కాకుండా మరో అప్డేట్ కూడా ఇచ్చారు.ఈ సినిమాకు ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా తాము ఒక సెలెబ్రేషన్ సాంగ్ తో రీరికార్డింగ్ పనులతో స్టార్ట్ చేశామని తెలిపారు.అలాగే ఈ సినిమాలో 6 పాటలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసారు.దీంతో ఇది ఊహించని సర్ప్రైజ్ అనే చెప్పాలి.ఇక ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు( Director K Raghavendra Rao ) గారు క్లాప్ కొట్టగా సినిమా స్టార్ట్ అయ్యింది.