ముఖ్యంగా చెప్పాలంటే దసరా ( Dussehra )పండుగ రోజు రావణ దహనం చేస్తూ ఉంటారు.ఇది మనలోని చెడును కాల్చివేయాలనే సందేశాన్ని ఇస్తుంది.
అయితే ఇప్పుడు మనం రావణా దహనం గురించి కాకుండా రావణుని వైభవం( Glory of Ravana ) గురించి తెలుసుకుందాం.రావణుడు ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడిపాడో అతని రాజభవనం ఎంత విలాసవంతమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం శ్రీలంకలో కనిపించే సిగిరియా ఒకప్పుడు రావణుడి లంక అని చెబుతున్నారు.రావణుడికి ఇక్కడ ఒక పెద్ద రాతి పై ఒక రా భవనం ఉందని అక్కడ అతను సురక్షితంగా నివసించాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ఇక్కడికి సమీపంలో ఒక ప్రత్యేక విమానాశ్రయం ఉందని అక్కడి నుంచి రావణుని పుష్పక విమానం ఎగిరేదని కూడా చెబుతున్నారు.అప్పటి కాలానికి అనుగుణంగా రావణుడి రాజ భవనం పలు ఆధునిక సౌకర్యాలతో ఉండేది.ప్రస్తుత కాలానికి సంబంధించిన ఎన్నో సౌకర్యాలు రావణుడు అప్పటి కాలంలోనే అనుభవించాడని పురాణాలు చెబుతున్నాయి.అలాగే రావణుడు అపర మేధావి అని కూడా పురాణాలలో ఉంది.ఇంకా చెప్పాలంటే రావణుని రాజ భవనానికి లిఫ్ట్ సౌకర్యం ఉందని,అలాగే నీటి నిర్వహణకు ఆధునిక వ్యవస్థ కూడా ఉండేదని చెబుతున్నారు.
పురాణ గ్రంధాల ప్రకారం శ్రీలంకలోని సిగిరియ రాతి పై పురాతన ప్యాలెస్ అవశేషాలు కూడా ఉన్నాయి.ఇక్కడి రాగైలా అడవుల్లో రావణుని మృతదేహాన్ని దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తు లో ఉంచినట్లు శ్రీలంక మీడియా చెబుతోంది.ఇంకా చెప్పాలంటే దానిని మమ్మీ రూపంలో ఉంచారని చెబుతున్నారు.
అయితే దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని కూడా చెబుతున్నారు.అలాగే శ్రీలంకలో రావణుని ప్యాలెస్ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందినట్లు సమాచారం.