మెగా గాడ్ ఫాదర్ టీజర్ డేట్ ఫిక్స్.. అభిమానులకు పూనకాలే?

మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

 Mega Godfather Teaser Date Fix Are Fans Excited Lucifer, Malayalam,godfather In Telugu, Megastar Chiranjeevi ,director Mohan Raja, Tollywood-TeluguStop.com

ఈ సినిమా షూటింగ్ పనులను త్వరగా పూర్తిచేసుకుని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నారు.ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు.

గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ విడుదల తేది ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ విడుదల చేశారు.ఈ సినిమా నుంచి టీజర్ ఆగస్టు 21వ తేదీ విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు.

 Mega Godfather Teaser Date Fix Are Fans Excited Lucifer, Malayalam,Godfather In Telugu, Megastar Chiranjeevi ,director Mohan Raja, Tollywood-మెగా గాడ్ ఫాదర్ టీజర్ డేట్ ఫిక్స్.. అభిమానులకు పూనకాలే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఈ సినిమాని దసరా కానుకగా విడుదల చేస్తున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టనున్నారు.ఈ క్రమంలోనే ఈ నెల టీజర్, వచ్చే నెల ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి మెగాస్టార్ ఫస్ట్ లుక్ విడుదల కావడంతో ఈయన ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచాయి.

Telugu Mohan Raja, Lucifer, Malayalam, Chiranjeevi, Tollywood-Movie

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ సైతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో సందడి చేయనున్న విషయం మనకు తెలిసిందే.ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తుండడం గమనార్హం.

ఈ సినిమా టీజర్ విడుదల తేదీనీ ప్రకటించడంతో మెగా అభిమానులు ఈ టీజర్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube