రాఖీ పండుగ వేళ ఒకే ఫ్రేములో మెగా బ్రదర్స్..!

నిన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే.మెగా కుటుంబం మొత్తం మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు.

 Mega Brothers Celebrate Raksha Bandhan Pics Viral, Chiranjeevi, Naga Babu, Pawan-TeluguStop.com

అటు అభిమానులు తో పాటు సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్ కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేసిన విషయం తెలిసిందే.అయితే మెగా కుటుంబం మెగాస్టార్ పుట్టిన రోజుతో పాటు రాఖీ పండుగ కూడా ఘనంగా జరుపుకున్నారు.

రాఖీ పండుగ సందర్భంగా మెగా బ్రదర్స్ అందరు ఒక దగ్గర కలుసు కుని తమ తోబుట్టువులతో ఘనంగా రాఖీ వేడుకలు జరుపు కున్నారు.మాములుగా అయితే మెగా బ్రదర్స్ ఒక దగ్గర కలుసు కోవడం చాలా అరుదు.

ఎందుకంటే ఎవరి షూటింగులతో వారు బిజీగా గడుపుతారు.ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కానీ లేదా సినిమాలకు సంబంధించిన ఈవెంట్స్ లో కానీ కనిపిస్తూ ఉంటారు.

మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు అయితే అప్పుడప్పుడు కనిపిస్తారు కానీ వీరితో పాటు పవన్ కళ్యాణ్ అయితే అస్సలు కనిపించే అవకాశమే లేదు.

మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.అయితే నిన్న రాఖీ పండుగ సందర్భంగా అందరు ఒకే దగ్గర కలిసి పండుగ ఘనంగా జరుపుకున్నారు.వాళ్ళ తోబుట్టువులతో రాఖీ కట్టించుకున్న వీడియో చిరంజీవి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసాడు.

ఈ వీడియోలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ కు వాళ్ళ తోబుట్టువులు ఇద్దరు రాఖీ కట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు.రాఖీ కట్టిన తర్వాత ముగ్గురు మెగా బ్రదర్స్ ఒకే దగ్గర నిలబడి ఉంటే తోబుట్టువులు ఇద్దరు వాళ్లకు హారతి ఇచ్చారు.

ఇందులో మరొక విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ స్వయంగా వాళ్ళ అన్నయ్యకు మంచి నీళ్లు అందిస్తూ ఎంతో సాదాసీదాగా కనిపించి మరొకసారి తన నిరాడంబరతను చాటుకున్నారు.ఏది ఏమైనా రాఖీ పండుగ వేళ అన్నదమ్ములు ముగ్గురు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube