ఉల్లిగడ్డ పంట(Onion Cultivation ) ఒక స్థిరమైన ధర లేని పంట.కొన్ని సందర్భాల్లో ఉల్లిగడ్డ ధర ఆకాశాన్ని అంటితే, మరికొన్ని సందర్భాల్లో ఉల్లిగడ్డ పంట చేతికి వచ్చే సమయానికి ధరలు నేలచూపులు చూస్తాయి.
ఉల్లిగడ్డ గరిష్ట కనిష్ట ధరల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ.కాబట్టి ఉల్లిగడ్డ ను సాగు చేస్తే అధిక దిగుబడి సాధించవచ్చు కానీ ఆదాయం మాత్రం ఊహించలేం.
ఉల్లిగడ్డ పంటకు సాధారణంగా తెగుళ్ల బెడద కాస్త తక్కువే.కానీ తెగుళ్లు ఆశిస్తే తొలి దశలో అరికట్టడం విఫలం అయితే దిగుబడి చాలా వరకు తగ్గి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ఉల్లిగడ్డ పంటకు పెనుబంక తెగులు సోకితే సకాలంలో గుర్తించి తొలి దశలోనే అరికట్టాలి.
లేకపోతే ఎదుగుతున్న మొక్కల రసాన్ని మొత్తం పీల్చడం వల్ల ఎదుగుదల ఆగే అవకాశం ఉంది.ఈ పెనుబంక తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి.ఈ తెగులను గుర్తించిన రోజే పిచికారి మందులను పంటపై పిచికారి చేయాలి.
పెనుబంక తెగులు సోకిన మొక్కలు తక్కువగా ఉంటే వాటిని తొలగించి, ఒక లీటరు నీటిలో ఒక మిల్లీమీటర్ మలాథియాన్ ( Malathion )50EC ను కలిపి పిచికారి చేయాలి.లేదంటే ఒక లీటరు నీటిలో 1.5 మిల్లీలీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 36SL ను కలిపి పిచికారి చేయాలి.
ఉల్లిగడ్డ పంటకు వివిధ రకాల తెగుళ్లు లేదంటే వివిధ రకాల చీడపీడలు( Pests ) ఆశించడానికి కలుపు మొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి.పైగా వ్యాప్తికి కూడా కలుపు మొక్కలే కీలకం.కాబట్టి ఉల్లిగడ్డ పొలంలో కలుపు మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఉల్లిగడ్డ నారు నాటిన 48 గంటల వ్యవధిలో ఒక ఎకరం పొలానికి 1.25 లీటర్ల పెండిమిథలిన్ ను ఇసుకలో కలుపుకొని తేమ ఉండే నేలపై చల్లాలి.మొక్కలపై పడకుండా చల్లుకోవాలి.ఉల్లిగడ్డ నారు నాటిన 40 రోజుల వరకు కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.