సజ్జ సాగులో ఈ మెళుకువలు పాటిస్తే.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి..!

వ్యవసాయంలో ఏ పంటను సాగుచేసిన తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో అధిక దిగుబడులు సాధించాలని రైతులు( Farmers ) భావిస్తారు.అయితే ఏ పంటను సాగు చేస్తారో ఆ పంట సాగు విధానంపై సరైన అవగాహన వచ్చిన తర్వాత సాగు చేస్తేనే అధిక దిగుబడి సాధించడానికి వీలు ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు చెబుతున్నారు.

 Measures To Be Taken In Pearl Millet Farming Details, Pearl Millet, Pearl Mille-TeluguStop.com

ఈ క్రమంలో చాలామంది రైతులు తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో సజ్జ పంట( Bajra ) సాగుచేసి అధిక దిగుబడి పొంది మంచి లాభాలు అర్జిస్తున్నారు.

సజ్జలను గింజల కోసం మాత్రమే కాదు పశువులకు మేతగా కూడా వేయవచ్చు.

పైగా సజ్జ పంట అన్ని రకాల ఉష్ణోగ్రతలను( Temperatures ) తట్టుకోగలుగుతుంది.సజ్జ పంటను వర్షాధార పంటగా సాగు చేయవచ్చు.

నీటి నిల్వ శక్తి తక్కువగా కలిగి ఉన్న భూముల్లో ఈ పంటను సాగు చేసి అధిక దిగుబడి( High Yielding ) పొందవచ్చు.ఎలాంటి నేలలోనైనా సజ్జ పంటను సాగు చేయవచ్చు.

Telugu Agriculture, Bajra, Bajra Farmers, Farmers, Techniques, Kharif Crop, Pear

అయితే ఎలాంటి నేలలో సాగు చేయాలనుకున్న ముందుగా ఆ నేలలో ఇతర పంటలకు సంబంధించిన అవశేషాలను పూర్తిగా తొలగించాలి.ఆ తర్వాత లోతు దుక్కులు దున్నుకోవాలి.లోతు దుక్కుల వల్ల నేలలో ఉండే శిలీంద్రాలన్నీ చనిపోతాయి.సజ్జాలను ఖరీఫ్ పంటగా( Kharif Crop ) అధికంగా పండిస్తారు.జూన్ లేదా జూలై మాసాల్లో సాగు చేపట్టడానికి అనువైన సమయం.ఒకవేళ రబీ పంటగా( Rabi ) సాగు చేయాలనుకుంటే అక్టోబర్ లేదా నవంబర్ లో విత్తుకోవాలి.

అదే వేసవిలో సాగు చేయాలనుకుంటే జనవరి నెలలో విత్తుకోవాలి.

Telugu Agriculture, Bajra, Bajra Farmers, Farmers, Techniques, Kharif Crop, Pear

ఒక ఎకరం పొలానికి 1.5 కిలోల విత్తనాలు అవసరం.ముందుగా విత్తనాలను( Seeds ) ఉప్పు ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి ఉంచి, ఆ తర్వాత కిలో విత్తనాలకు మూడు గ్రాముల అప్రాన్ 35 ఎస్.డి తో విత్తన శుద్ధి చేసుకోవాలి.ఆ తర్వాత మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య గాలి మరియు సూర్యరశ్మి బాగా తగిలే విధంగా పొలంలో విత్తుకోవాలి.

ఇలా చేస్తే పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద చాలా తక్కువ.పంటకు ఏవైనా చీడపీడలు సోకితే తొలి దశలోనే నివారణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube