మారుతితో మళ్లీ సాయి ధరం తేజ్.. సూపర్ హిట్ కాంబో రిపీట్..!

వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న మారుతి రీసెంట్ గా మంచి రోజులు వచ్చాయి సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.సంతోష్ శోభన్, మెహ్రీన్ కౌర్ జంటగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది.

 Maruthi Sai Dharam Tej Movie Super Hit Combination Repeate, Maruthi ,sai Dharam-TeluguStop.com

ఇక ప్రస్తుతం మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్న మారుతి తన నెక్స్ట్ సినిమా మరోసారి మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ తో ఉంటుందని చెప్పాడు.మంచి రోజులు వచ్చాయి ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి సాయి తేజ్ సినిమా విషయాన్ని చెప్పారు.

సాయి తేజ్ ఆరోగ్యం కూడా కుదుటపడుతుందని.ప్రస్తుతం ఆయన పర్ఫెక్ట్ గా ఉన్నాడని అన్నారు.ఆల్రెడీ ప్రతిరోజూ పండుగే సినిమాతో సాయి ధరం తేజ్ కు మంచి హిట్ ఇచ్చిన మారుతి మరోసారి సాయి ధరం తేజ్ తో సినిమాకు సిద్ధమయ్యాడు.గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా తర్వాత మారుతి చేసే సినిమా సాయి తేజ్ తోనే అని తెలుస్తుంది.

సాయి ధరం తేజ్ ప్రస్తుతం సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు. యాక్సిడెంట్ వల్ల షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన సాయి ధరం తేజ్ త్వరలో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube