ప్రియుడుతో కాపురం పెట్టిన ఇద్దరు పిల్లల తల్లి.. భర్త ఏం చేశాడంటే..?

అక్రమ సంబంధం( Illegal relationship ) ముసుగులో వివాహ బంధం, పిల్లలు, కుటుంబం లాంటివి గుర్తుండవు.కేవలం అక్రమ సంబంధం పెట్టుకున్న భాగస్వామి కు మాత్రమే ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు.

 Man Stabs Wife To Death Due To Illegal Relationship In Bangalore Details, Man St-TeluguStop.com

ప్రస్తుతం రాను రాను సమాజంలో ఇలాంటివి పెరుగుతూ, పిల్లలను అనాధలుగా రోడ్డున పడుతున్నారు.అన్నీ తెలిసినా కూడా వివాహ బంధం కంటే వివాహేతర బంధానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో ఎప్పుడోసారి కుటుంబాలు నాశనం అవ్వక తప్పదు.

ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ఏంటో చూద్దాం.

ఒక యువతి వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలు సంతానం కలిగాక వేరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, భర్తను కాదని ఏకంగా కాపురం పెట్టేసింది.

భర్తకు విషయం తెలియడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోల్ కత్తా ప్రాంతానికి చెందిన షేక్ సుహేల్ కు,( Shaik sohail ) అదే ప్రాంతానికి చెందిన తబ్సీన్ బేబీ కు ( Tabsin baby ) 14 సంవత్సరాల క్రితం వివాహం అయింది.

సుహేల్ టైలరింగ్ పనిచేసే కుటుంబాన్ని పోషించేవాడు.కొన్ని సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం బెంగుళూరు వచ్చి కేజీ.హాళ్లి లో నివాసం ఉంటున్నారు.వీరికి ఇద్దరు పిల్లలు సంతానం.

Telugu Bangalore, Relationship, Stabs, Shaik Sohail, Tabsin Baby, Taxi-Latest Ne

అయితే తబ్సీన్ బేబి కు ఒక ట్యాక్సీ డ్రైవర్తో పరిచయం కాస్త అక్రమ సంబంధం గా మారింది.ఈ విషయం సూహేల్ కు తెలియడంతో భార్య పిల్లలతో సహా ఆరు సంవత్సరాల క్రితం బెంగుళూరు వదిలి కోల్ కత్తా కు వెళ్లిపోయాడు.ఒక ఆరు నెలల తర్వాత తబ్సీన్ భర్తను వదిలిపెట్టి సారాయి పాళ్యా ఆఫీజా లేఔట్ లో ప్రియుడితో కలిసి కాపురం పెట్టేసింది.వీరిద్దరికీ రెండున్నర ఏళ్ల కుమారుడు సంతానం.

Telugu Bangalore, Relationship, Stabs, Shaik Sohail, Tabsin Baby, Taxi-Latest Ne

సుహేల్ తన భార్యపై కోపంతో సోమవారం అర్ధరాత్రి బెంగళూరు వచ్చి, భార్య తబ్సీన్ బేబీ ను తిరిగి కోల్ కత్తా రావాలని గొడవ చేయగా అందుకు భార్య తిరస్కరించింది.కోపంలో భార్య గొంతు పై కత్తితో పొడిచి హత్య చేసి, ఆ బాలుని తొడపై కత్తితో పొడిచి పరారయ్యాడు.పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని మృతుదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, సుహేల్ ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube