భారీ వర్షాలు, వరదలు వస్తే ఇళ్లలో నుంచి బయటకు రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఎవరైనా వచ్చి సహాయం అందించాల్సిందే.
అయితే ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెస్క్యూ సిబ్బంది సహాయ కార్యక్రమాలు అందిస్తూ ఉంటారు.వరదల్లో( Floods ) చిక్కుకున్న వ్యక్తుల కోసం ఆహార పదార్థాలు, సరుకులు లాంటివి విమాన సహాయంతో అందిస్తున్న విషయాలను అప్పుడప్పుడు వినే ఉంటాం.
అయితే ఓ వ్యక్తి భారీ వరదల్లో కూడా ఎంతో హాయిగా, దర్జాగా ప్రయాణిస్తూ చూసే వారందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆ వ్యక్తి ఏ విమానంలోనో, ఏ బోటులోనో ప్రయాణించలేదు.
కేవలం ఒక కర్ర దుంగపై( Tree Log ) కూర్చొని వరదకు గురైన వీధుల్లో ప్రయాణించాడు.తనకు అవసరమైన చోటికి వెళ్లి అవసరమైనవి కొనుక్కొని దర్జాగా ఇంటికి రావడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ వీడియోలను తీశారు.
ఆ వీడియోలో ఓ వ్యక్తి మనిషి మునిగిపోయే స్థాయి వరకు వచ్చిన వరద నీటిలో( Flood Water ) ఓ పెద్ద కర్ర దుంగను పడవ లాగా నడుపుతున్నాడు.ఒక చేతిలో కర్ర పట్టుకొని అడ్డుగా వచ్చే వాటిని పక్కకు జరుపుకుంటూ నచ్చిన చోటికి వెళ్తున్నాడు.తనకు కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాడు.అలాగే మెడికల్ షాపు వద్దకు వెళ్లి తనకు కావాల్సిన మందులు కొని ఒక వాటర్ బాటిల్ కొనుక్కున్నాడు.
ఆ వ్యక్తి వాటర్ తాగుతున్నప్పుడు అక్కడ ఉండే వారంతా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అతని వద్ద ఉండే డబ్బులు నాని పోకుండా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టుకున్నాడు.ఈ వీడియోను చూసిన వారందరూ భలేగా ప్రయాణిస్తున్నాడని కొనియాడారు.కొంతమంది ఇతడి తెలివిని అభినందిస్తూ సమస్యలు వచ్చినపుడు కృంగిపోకుండా ధైర్యంగా ఆలోచించి ముందు అడుగు వేయడం ఇలాంటి వారిని చూసి నేర్చుకోవాలని ఆ వ్యక్తిని ప్రశంసిస్తున్నారు.