భార్యను చంపి, పారిపోతు పోలీసులకు అడ్డంగా చిక్కిన నిందితుడు..!

మనిషి చెడు అలవాట్లకు బానిసైతే ఎప్పుడో ఒకప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడుతుంది అనడానికి ఈ సంఘటన నిదర్శనం.ఈ మధ్యకాలంలో చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తులు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ దారుణాలకు పాల్పడుతున్నారు.

 Man Beat Wife To Death For Not Paying For Alcohol In Mumbai Details, Man, Beat W-TeluguStop.com

ఏకంగా హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.ఈ క్రమంలోనే ఓ వ్యక్తి కుటుంబ బాధ్యతలను మరిచి తాగుడుకు బానిస( Alcohol Addicted ) అయ్యాడు.

మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో.భార్యను విచక్షణ రహితంగా కొట్టి చంపిన ఘటన ముంబై నగరంలో( Mumbai ) చోటు చేసుకుంది.

అందుకు సంబంధించిన వివరాలు ఏంటి చూద్దాం.

వివరాల్లోకెళితే.ముంబై నగరంలోని గోరెగావ్, మలాడ్ రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన మొయినుద్దీన్ నస్రుల్లా అన్సారీ, పర్వీన్ మొయినుద్దీన్(36) అనే దంపతులు నివాసం ఉంటున్నారు.మద్యానికి బానిసైన అన్సారీ( Ansari ) కుటుంబ బాధ్యతలను మరిచి తరచూ డబ్బుల కోసం భార్యను వేధించేవాడు.

ఈ క్రమంలోనే మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్య పర్వీన్ ను( Parveen ) విచక్షణ రహితంగా కొట్టాడు.దీంతో ఆమె అపస్మారగా స్థితిలోకి వెళ్లిపోయింది.పర్వీన్ ను సమీపంలో ఉండే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

భార్య పర్వీన్ మృతి చెందిన విషయం తెలిసి అన్సారీ ముంబై నగరం నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.అయితే మలాడ్ లోని మల్వానీ లో బోరివలి రైల్వే పోలీసులకు అడ్డంగా చిక్కాడు.నిందితుడు అన్సారీ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

భార్య పర్వీన్ మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube