Mahesh Babu Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మను ఘనంగా చేసిన మహేష్ బాబు.. అభిమానులకు 32 రకాల వంటకాలు?

దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలిసిందే.ఈ నెల 15న సూపర్ స్టార్ కృష్ణ విడిచారు.

 Mahesh Babu Arranged 32 Types Of Food Items For Fans At Superstar Krishna 11th D-TeluguStop.com

సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని ఇప్పటికీ ఘట్టమనేని ఫ్యామిలీ ఘట్టమనేని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి మరణించిన బాధ నుంచి బయటపడలేకపోతున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సూపర్ సార్ కృష్ణ ఇంట్లో కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాలను నిర్వహించారు కుటుంబ సభ్యులు.సూపర్ సార్ కృష్ణ ఆత్మకు శాంతి కలగాలని పూజలు చేయించారు.

అయితే మొదట ఇంటి దగ్గర శాస్త్రోంక్తంగా పూజలు చేసిన ఘట్టమనేని ఫ్యామిలీ ఆ తర్వాత అతిథులకు విందును ఇచ్చారు.

అలాగే కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాన్ని హైదరాబాదులోని జేఆర్సి కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు.

తన తండ్రి పెద్దకర్మకు విచ్చేసే అతిధుల కోసం రెండు వేదికలను ఏర్పాటు చేశారు మహేష్ బాబు.అభిమానుల కోసం జేఆర్సీ కన్వెన్షన్‌లో విందు ఇచ్చారు.అయితే అభిమానులు భారీగా తరలివస్తారని ఊహించిన మహేష్ బాబు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం పాస్ సిస్టమ్ పెట్టారు.అభిమానులందరికీ పాస్‌లు ఇచ్చారు.

పాస్‌లు ఉన్నవారిని మాత్రమే జేఆర్సీ కన్వెన్షన్‌లోకి అనుమతించారు.అంతే కాకుండా తన తండ్రి పెద్దకర్మ కార్యక్రమానికి హాజరైన అభిమానుల కోసం ఏకంగా 32 రకాల వంటకాలను మహేష్ బాబు సిద్ధం చేయించారు.

తండ్రి చనిపోయిన బాధలో ఉన్నప్పటికీ అభిమానులకు మాత్రం ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటూ మరొకసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు మహేష్ బాబు.అయితే జేఆర్సీ కన్వెన్షన్‌లో భోజనం చేసిన కొందరు అభిమానులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ మహేష్ అన్న మా కోసం 32 ఐటెమ్స్ పెట్టించారు.మహేష్ అన్నని ఆ దేవుడు చల్లగా చూడాలి అని కొందరు కామెంట్స్ చేయగా, ఇంకొందరు సూపర్ స్టార్ కృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మహేష్ బాబు పెద్ద కర్మకు వచ్చినవారందరూ కూడా భోజనం చేసి సురక్షితంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube