సెకండ్‌ వీకెండ్‌ లో 'లవ్‌ స్టోరీ'కి వచ్చింది ఎంత?

నాగ చైతన్య, సాయి పల్లవిల లవ్‌ స్టోరీ చిత్రం విడుదల అయ్యి రెండవ వారం కూడా మంచి జోష్‌ తో నడుస్తోంది.గత వారం విడుదల అయిన రిపబ్లిక్ మూవీ కమర్షియల్‌ గా ఆకట్టుకోలేక పోయింది అంటూ టాక్‌ వచ్చిన నేపథ్యంలో లవ్‌ స్టోరీనే జనాలు ఎక్కువగా చూస్తున్నారు.

 Love Story Second Week Collections,tollywood News,naga Chaitanya,sekhar Kammul,s-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న లవ్ స్టోరీ సినిమా ను చూస్తున్న నేపథ్యంలో రెండవ వీకెండ్‌ లో కూడా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రెండవ శనివారం సినిమాకు 1.5 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయి.ఇక రెండవ ఆదివారంలో దాదాపుగా రెండు కోట్ల వరకు వసూళ్లు నమోదు అయినట్లుగా తెలుస్తోంది.

సాదారణంగా ఒక మీడియం రేంజ్ సినిమా రెండవ వారంలో ఈ సమయంలో ఇంతగా వసూళ్లు చేయడం అంటే మామూలు విషయం కాదు.బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను దక్కించుకున్న లవ్‌ స్టోరీ సినిమా లాంగ్‌ రన్ వరకు 50 కోట్లకు వెళ్లడం ఖాయం అంటున్నారు.

Telugu Love Story, Naga Chaitanya, Sai Pallavi-Movie

ఏపీలో టికెట్ల రేట్లు మరీ తక్కువ ఉండటం వల్ల ఇలా వసూళ్లు నమోదు అయ్యాయి.కాని తెలంగాణలో ఉన్నట్లుగా టికెట్ల రేట్లు ఉంటే ఖచ్చితంగా ఏపీలో కూడా మంచి వసూళ్లు నమోదు చేసి ఏకంగా 75 కోట్ల వరకు వసూళ్లు నమోదు అయ్యి ఉండేవి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సాయి పల్లవి మరియు నాగ చైతన్య ల కాంబోకు మంచి మార్కులు పడ్డాయి.రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు సెకండ్ వేవ్‌ తర్వాత అంటూ అంతా చెబుతున్నారు.దసరా సీజన్ లో రాబోతున్న సినిమాలు ఏమైనా లవ్‌ స్టోరీ సినిమా వసూళ్లను క్రాస్ చేస్తాయా అనేది చూడాలి.నెట్టింట లవ్‌ స్టోరీ సినిమా వసూళ్ల విషయంలో అభినందనలు తెలియజేస్తూ అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube