బెయిల్‌ వచ్చినా జైల్లోనే

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్‌ అయిన విషయం తెల్సిందే.ఆగస్టు 21వ తారీకున అరెస్ట్‌ అయిన చిదంబరం గత రెండు నెలలుగా జైల్లోనే ఉంటున్నాడు.

 Latest Update Of Congress Leader Chidambaram-TeluguStop.com

ఇప్పటికే చాలా సార్లు బెయిల్‌కు విజ్ఞప్తి చేసినా కూడా ప్రయోజనం దక్కలేదు.ఎట్టకేలకు ఇటీవల చిదంబరంకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

అయితే ప్రస్తుతం ఈడీ ఆధీనంలో చిదంబరం ఉన్న కారణంగా బెయిల్‌ వచ్చినా కూడా ఆయన జైల్లో ఉండాల్సిన పరిస్థితి.

సుప్రీం కోర్టు ఈడీకి కస్టడీకి ఇచ్చిన గడువు పూర్తి అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లే అవకాశం ఉంది.

గత రెండు నెలలుగా ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు.ఆమద్య ఆరోగ్యం బాగా లేక హాస్పిటల్‌కు కూడా వెళ్లాడు.ఒక చిన్న కేసులో ఆయన్ను అరెస్ట్‌ చేశారని, బీజేపీ కక్ష సాధింపు చర్య అంటూ కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.చిదంబరం పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుతం కోర్టులో బెయిల్‌ వచ్చినా జైల్లోనే ఉన్న చిదంబరం మరో రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube