కుమారి ఆంటీ( Kumari Aunty ) ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు.ఈమె హైదరాబాద్ లో( Hyderabad ) రోడ్డు పక్కన ఫుడ్ పెట్టి జీవనోపాధి జరుపుకుంటున్నారు.
ఇలా ఈమె ఎన్నో రకాల నాన్ వెజ్ ఆహార పదార్థాలను తక్కువ ధరలకే అమ్ముతూ ఎంతో మంది ఆకలిని తీరుస్తున్నారు.ఫుడ్ రేటు తక్కువగా ఉండడంతో ఎంతోమంది కుమారి ఆంటీ ఫుడ్( Kumari Aunty Food ) టెస్ట్ చేయడం కోసం ఎగబడుతూ వచ్చేవారు అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడకు వచ్చి ఈమె ఫుడ్ టెస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో పోలీసులు ఈమెను అక్కడి నుంచి బిజినెస్ క్లోజ్ చేసి పంపించారు.దీంతో పెద్ద ఎత్తున వివాదం చోటుచేసుకుంది.
ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ఈ ఘటన పై స్పందిస్తూ రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే వారిని ఏమాత్రం ఇబ్బందులు పెట్టకూడదంటూ ఆదేశాలు ఇవ్వడంతో తిరిగి ఈమె యధావిధిగా తన బిజినెస్ ప్రారంభించారు.ఇలా ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఉన్నటువంటి.కుమారి ఆంటీ మీది 1000 అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ చెప్పినటువంటి డైలాగ్ కూడా ఎంతో ఫేమస్ కావడంతో సోషల్ మీడియాలో చాలామంది ఈ డైలాగ్స్ తో రీల్స్ చేసేవారు.
ఇలా ఈమె భారీ స్థాయిలో పాపులర్ కావడంతో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేశారు.ఇకపోతే తాజాగా కుమారి ఆంటీ నెల సంపాదన( Kumari Aunty Monthly Income ) గురించి స్వయంగా ఆమె మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మీకు నెలకు ఎంతవరకు మిగులుతుందనే విషయం గురించి యూట్యూబ్ ఛానల్ వారు ఈమెను ప్రశ్నించారు.
ఈ ప్రశ్నకు కుమారి ఆంటీ సమాధానం చెబుతూ తను ప్రతిరోజు ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను తయారు చేసి అమ్మడం వల్ల అన్ని ఖర్చులు పోను ఒకటిన్నర లక్ష వరకు మిగులుతుంది అంటూ కుమారి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ విషయం తెలిసి నేటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.కుమారి ఆంటీ సంపాదన ముందు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా తక్కువే అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈమె మధ్యాహ్నం 12:30 నుంచి 2:00 లోపు తన ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేస్తారని ఈ కొన్ని గంటలలోనే భారీ స్థాయిలో సంపాదిస్తున్నారని చెప్పాలి.ఒకప్పుడు జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చినటువంటి ఈమె ఇప్పుడు నలుగురకు ఉపాధి కల్పిస్తూ ఈ ఫుడ్ బిజినెస్ నడుపుతూ ఉన్నారని చెప్పాలి.