తెలంగాణ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్…( Bandi Sanjay ) పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే అవకాశం ఉందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చాలామంది కేసిఆర్( KCR ) కోవర్ట్ లు ఉన్నారని ఆరోపించారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా చేయొచ్చని అన్నారు.
ఆదివారం కరీంనగర్ లో ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో జాయిన్ కావడం జరిగింది.ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో( Congress Party ) చాలామంది నాయకులు కేసీఆర్ టచ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కి ప్రజాస్వామ్యంపై రాజ్యాంగంపై నమ్మకం లేదని అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.దీంతో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ( KTR ) స్పందించారు.“2018లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంటు స్థానాల్లో బీజేపీ( BJP ) గెలవటంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించింది.బండి సంజయ్ మాటలు గమనిస్తుంటే కాంగ్రెస్, బీజేపీ మళ్లీ కలిసి పని చేయబోతున్నారని తెలుస్తోంది” అని ట్విట్టర్ లో కేటీఆర్ రియాక్ట్ కావడం జరిగింది.ఇదిలా ఉంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి చెందటం తెలిసిందే.
దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో మళ్లీ సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తుంది.