ఓ ప‌క్క యుద్ధం జ‌రుగుతుంటే.. మ‌రో ప‌క్క కిమ్ ఏం చేశాడో చూడండి..?

న్యూఇయ‌ర్ ఆరంభంలోనే ఉత్త‌ర కొరియా క్షిప‌ణుల ప‌రీక్ష‌ల‌తో ప్ర‌పంచ దేశాల‌కు వ‌ణుకు పుట్టిస్తోంది.ఇప్ప‌టికే ఆంక్ష‌ల‌తో కొట్టు మిట్టాడుతున్న ఈ దేశం అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు క్షిప‌ణి ప‌రీక్ష‌ల‌తో విరుచుకుప‌డుతోంది.2017 ఆగ‌స్టులో ఉత్తర కొరియా చేప‌ట్టిన మిస్సైల్ ప‌రీక్ష‌ల సైర‌న్ మోత‌లు జ‌పాన్‌కు వినిపించాయి.కానీ, ఈసారి విభిన్నంగా ఉంది.

 Kim Aggressive In Battle What Did The Original Do , North Korea,north Korea La-TeluguStop.com

ఎలాంటి హెచ్చ‌రిక‌లు లేకుండానే ఒక ఖండాంత‌ర బాలిస్టిక్ క్షిప‌ణిని జ‌పాన్ మీదుగా ఫ‌సిఫిక్ మ‌హా స‌ముద్రంలోకి ప్రయోగించింది.ఇది సాహ‌స‌మ‌నే చెప్పాలి.

అంటే మ‌రోసారి ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ త‌న దూకుడును ప్ర‌ద‌ర్శిస్తున్నాడ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.  ప్ర‌పంచ వ్యాప్తంగా ర‌ష్యా- ఉక్రెయిన్ యుద్ధం విష‌యం చ‌ర్చ‌ణీయాంశ‌మైంది.

మ‌రో ప‌క్క చ‌ర్చ‌లు కూడా జ‌రుగుతున్నాయి.ఈనేప‌థ్యంలో క్షిప‌ణి ప్ర‌యోగం చేసి ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీశారు.

అస‌లు కిమ్ ప్ర‌యోగించింది ఒక బాలిస్టిక్ మిసైల్ అని ద‌క్షిణ కొచియా, జ‌పాన్ సైనిక అధికారులు ప్ర‌క‌టించారు.జ‌పాన్ స‌ముద్ర జ‌లాల్లోకి దానిని ప్ర‌యోగించిన‌ట్టు చెప్పారు.

ఇటీవ‌ల దూకుడు పెంచిన ఉత్త‌ర కొరియా అత్యాధునిక ఆయుధాల‌ను ప‌రీక్షిస్తూ ముందుకు వెళ్తోంది.దీని వెన‌క అమెరికాను లక్ష్యం చేయ‌డ‌మే కార‌ణంగా నిపుణులు సూచిస్తున్నారు.

కిమ్ దూకుడుకు త‌మ దేశ భ్ర‌ద‌తకు ప్ర‌మాదం పొంచి ఉంద‌ని జ‌పాన్ దేశం అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తోంది.

అత్యంత ప్ర‌మాద‌క‌ర‌ మైన అణ్వాయుధాల‌తో ద‌క్షిణ కొరియా, జ‌పాకు కంటి మీద కునుకు లేకుండా ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ చేస్తున్నారు.

తాజాగా మ‌రో మిసైల్ ప్ర‌యోగం చేప‌ట్టారు.కాగా త‌మ దేశంపై అమెరికా అక్క‌సుతో ఉన్నందు వ‌ల్లే తాము అణు ప‌రీక్ష‌లు ముమ్మ‌రం చేసిన‌ట్టు నార్త్ కొరియా వెల్ల‌డించింది.

ఒక్క నెల కాలంలో ఏడు సార్లు క్షిప‌ణి ప్ర‌యోగాలు కిమ్ నిర్వ‌హించాడు.అయితే చైనా వింట‌ర్ ఒలంపిక్స్ కార‌ణంగా కొంత‌ కాలంగా వాటిని నిలిపి వేసింది.

ఇటీవ‌ల అవి ముగిసాయి.దీంతో కిమ్ మ‌ళ్లీ దూకుడు పెంచారు.

ఇందుకు రీసెంట్ గా  బాలిస్టిక్ మిసైల్ ప్ర‌యోగించ‌డం నిద‌ర్శ‌నం.దీనిపై ద‌క్షిణ కొరియాతో పాటు వివిధ దేశాలు దృష్టి సారించే అవ‌కాశాలున్నాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Kim Aggressive In Battle What Did The Original Do

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube