ఖమ్మం నగరంలో పేదల ఇళ్ల స్థలాలకు శాశ్విత హక్కు పట్టాలు పంపిణీ

పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు అందించడం ద్వారా హక్కుదారులను చేస్తున్నామని శాశ్వత ఆస్తి హక్కులను కాపాడుకోవాలని , రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు .ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలకు గురువారం ఇండ్ల పట్టాలను మంత్రి అందజేశారు.

 Distribution Of Permanent Title Deeds To Poor Housing Places In Khammam City-TeluguStop.com

నగరంలోని 4 వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్ట నివాసితులు 77 మందికి , 58 వ డివిజన్ దొరన్నకాలనీలో 127 మందికి , అదేవిధంగా 31 వ డివిజన్ పత్తి మార్కెట్ ప్రాంతంలోని నివాసితులు 138 మందికి గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఇండ్ల పట్టాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు ఆస్తి హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతో నగరంలో పేదలు నివసించే 12 కాలనీలను గుర్తించి సర్వే చేయించడం జరిగిందని , గత ఎన్నో ఏళ్ళుగా నివాసముంటున్న పేద ప్రజలకు ఇండ్ల పట్టాలను అందించి హక్కు కల్పించాలనే సంకల్పంతో మహిళ పేరునే పట్టాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు .భవిష్యత్తులో ఇండ్ల స్థలాలు కలిగిన పేద ప్రజలకు ఇండ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనున్నదని , ప్రస్తుతం కల్పించబడిన ఆస్తి హక్కును ఎట్టి పరిస్థితులలో దుర్వినియోగం చేసుకోవద్దని మంత్రి సూచించారు .ఇండ్ల పట్టాలు పొందిన వారందరికి ఆధార్ , ఓటరు ఐడి కార్డుతో శాశ్వత చిరునామాకు గాను మీసేవలో నమోదు చేయించాలని అధికారులకు , స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు .ఇండ్ల పట్టాలు అందించడమే కాకుండా పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో మౌళిక వసతులను ఏర్పాటు చేసామని , తర్గత రోడ్లు ఏర్పాటు చేసుకున్నామని , ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు అందిస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు .జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు , సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ , ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీప్రసన్న , స్థానిక కార్పోరేటర్ జ్యోతిరెడ్డి , 6 వ డివిజన్ కార్పోరేటర్ నాగండ్ల కోటి , ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాద్ , అర్బన్ తహశీల్దారు శైలజ , నగరపాలక సంస్థ కార్పోరేటర్లు , స్థానిక ప్రజాప్రతినిధులు , తదితరులు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube