పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.గురువారం ఖమ్మం రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన నులి పురుగుల మందులను విద్యార్థులకు మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా రిక్కా బజార్ ప్రభుత్వ పాఠశాలకు రూ.50లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు.
వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాల, కళాశాల విద్యార్థులకు పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.కడుపులో నులి పురుగులు వృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవడం వల్ల వీటి సంక్రమణకు గురవుతారని విద్యార్థులు శుభ్రతను తప్పక పాటించాలన్నారు.
నులి పురుగులు ఉన్న పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, బలహీతన, కడుపు నొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పేర్కొన్నారు.నులి పురుగుల నివారణ మాత్రలతో ఎంతో ఉపయోగం ఉంటుందని, ఇతర జబ్బులకు మందులు వాడే పిల్లలు ఈ మాత్రలు వేసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారని వివరించారు.
అనంతరం మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా గారు, జిల్లా కలెక్టర్ VP గౌతమ్ గారు, DM &HO మాలతీ గారు, సుడా చైర్మన్ విజయ్ గారు, కార్పొరేటర్ విజయ గారు తదితరులు ఉన్నారు.