విద్యుత్, గ్యాస్, పెట్రోల్, డీజిల్, ధరలను తక్షణమే తగ్గించాలి:- కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో రాస్తా రోకో నిర్వహించి పెద్దఎత్తున నిరసన చేపట్టారు.

కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చల విడిగా నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ సామాన్యుడి నడ్డివిరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, శాసన సభ పక్షనేత మల్లు భట్టి విక్రమార్క పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలకు, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్,బస్ చార్జీలకు పెంపుకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన చేపట్టారు.వరి కొనుగోలు చేయకుండా గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ లాగా దొంగ నిరసన దీక్షలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని ఆరోపిస్తూ, తక్షణమే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సూరంశెట్టి కిషోర్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు.మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రంగా హనుమంతరావు, ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధనికుమార్,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ ఫయాజ్, షేక్ జహంగీర్, ఐఎన్టియుసి అధ్యక్షులు షేక్ బాజీ, ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అలీ, మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్,కాంగ్రెస్ మహిళ నాయకులు తోమకుల రమ, లక్ష్మీస్వాతి,అరుణ,జానకి,స్వాతీ,లురదమ్మ, డివిజన్ కమిటీ అధ్యక్షులు మొదలగు వారు పాల్గోన్నారు.

కార్మికులను బెల్టుతో ఇష్టానుసారం కొట్టిన చైనా వ్యక్తి.. వైరల్ వీడియో...?
Advertisement

Latest Khammam News