ఇవి పురుగులు కాదు బంగారు తాబేలు..ఎక్కడంటే..

ఈ పురుగులను బంగారు తాబేలు పురుగులు అంటారు.ఈ బంగారు తాబేలు పురుగులు ఇప్పుడు వైరల్ అయ్యింది.

 The Golden Tortoise Beetles Video Viral On Social Media Details, Golden Tortoise-TeluguStop.com

వీటిని చూస్తుంటే భలే అనిపిస్తున్నాయి కదా.ఈ పురుగులు ఎరుపు,గోధుమ రంగులోకి మారుతుంటాయి.సైంటిఫిక్ నేమ్ అయితే చారిడొటెల్లా సెక్స్‌పంక్‌టాటా.అలా పలకడం కష్టం.మొక్కల్ని తిని బతికే చిన్న శాకాహార పురుగులు ఇవి.కానీ వీటికి రెండు ప్రత్యేకతలున్నాయి.ఒకటి ఇవి బంగారం రంగులో మెరుస్తూ ఆకట్టుకుంటాయి.అదే సమయంలో… చిన్న తాబేళ్ల లాగా ఇవి కనిపిస్తాయి.ప్రకృతి వీటిని అలా పుట్టించింది.అందుకే అందరికీ నచ్చేస్తున్నాయి.

బంగారు రంగు కోసం వీటిని చంపి దాచుకోవాలని కొందరు కోరుకుంటారు.వారికి నిరాశ తప్పదు.ఎందుకంటే… ఈ రంగు వీటికి శాశ్వతం కాదు.వీటి జీవిత కాలంలో దశలను బట్టీ బంగారు రంగు రావడం, పోవడం జరుగుతుంది.

చనిపోయినప్పుడు ఈ రంగు పోతుంది.కాబట్టి చనిపోయాక ఇవి మామూలుగా కనిపిస్తాయి.

వీటికి సంబంధించి ఇంటర్నెట్‌లో చాలా వీడియోలు ఉన్నాయి.తాజాగా ఓ వీడియోని ట్విట్టర్‌లోని @AmazingNature00 అకౌంట్‌లో పోస్ట్ చేశారు.ఏప్రిల్ 11న పోస్ట్ అయిన ఆ వీడియోని ఇప్పటివరకు 9,04,000 మంది దాకా చూశారు.38 వేల మందికి పైగా లైక్ చేశారు.

ఇదే వీడియో ఇదివరకు వైరల్ అయినప్పుడు 1.5 లక్షల వ్యూస్ వచ్చాయి.ఇది మళ్లీ ఇప్పుడు వైరల్ అయ్యింది.మరోసారి ఆ పురుగుల్ని చూసి నెటిజన్లు ఆనందపడుతున్నారు.అవి నిజమైనవి.నేను చిన్నప్పుడు వాటితో ఆడుకునేదాన్ని.

వాటి అడుగు భాగం చాలా అందంగా ఉంటుంది.నేను వాటిని బోర్లా తిప్పినప్పుడు వాటి ముఖం, కాళ్లను చూసేదాన్ని.

అదో ఆనందం.అందుకే అవి నాకు బాగా గుర్తున్నాయని ఓ యూజర్ తెలిపారు.

తమకు ఆపద కలుగుతోంది అని భావించినప్పుడు ఆ పురుగులు ఎరుపు,గోధుమ రంగులోకి మారతాయి.ఈ వీడియోలో వేరే రంగులో ఉన్నాయని మరో యూజర్ తెలిపారు.

బంగారు వర్ణపు తాబేలు పురుగులు… ఉత్తర అమెరికాలో ఉంటాయి.తూర్పు అమెరికాలో ఇవి తినే మొక్కలు ఎక్కువగా ఉంటాయి.అందువల్ల అక్కడ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి.చిలకడ దుంపల ఆకుల్ని ఇవి బాగా తింటాయి.ఉదయాన్నే మార్నింగ్ వాక్ కి వెళ్లేవారికి ఈ పురుగులు కనిపిస్తాయి.ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తాయి.

ఇవి అలా ఎగురుతూ మెరుస్తూ ఉండటాన్ని చూసి అక్కడ ఉన్న ప్రజలు ఆనందిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube