రానున్న పార్లమెంట్ ఎన్నికలపై( Parliament Elections ) తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్( KCR ) ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది.ఈ మేరకు ఆయన ఎన్నికలకు వ్యూహాలు రచించనున్నారని సమాచారం.
ఇందులో భాగంగానే కేసీఆర్ త్వరలో కరీంనగర్ లో( Karimnagar ) మకాం వేయనున్నారని తెలుస్తోంది.పార్లమెంట్ ఎన్నికలు ముగిసేంత వరకు ఆయన అక్కడే ఉండాలనే యోచనలో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు కరీంనగర్ పొలిటికల్ సెంటిమెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఉమ్మడి కరీంనగర్ నుంచే స్టార్ట్ చేసేవారు.ఈ నేపథ్యంలోనే మరోసారి కరీంనగర్ నుంచే లోక్ సభ ఎన్నికలకు( Loksabha Elections ) వ్యూహారచన చేయనున్నారని తెలుస్తోంది.మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న గులాబీ బాస్ కరీంనగర్ నుంచి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.