రంగంలోకి కే‌సి‌ఆర్.. అంతకుమించి వ్యూహం !

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.రాష్ట్రంలో ఎన్నికలపై సందిగ్ధత కొనసాగుతున్నప్పటికి పార్టీలు మాత్రం ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చిన సిద్దమే అనే సంకేతాలను ఇస్తున్నాయి.

 Kcr Into The Fiel More Than Tha The Strategy, Cm Kcr ,brs Party , Ts Politics-TeluguStop.com

ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు యమ దూకుడు ప్రదర్శిస్తున్నాయి.అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్ రేస్ లో తామే ముందున్నామని బి‌ఆర్‌ఎస్ సంకేతాలివ్వగా.

ప్రస్తుతం ఎలక్షన్స్ పై కన్ఫ్యూజన్ ఏర్పడడంతో హస్తం పార్టీ మద్య అభ్యర్థుల ఎంపికను హోల్డ్ లో ఉంచింది.అయినప్పటికి రాష్టంలో అందరి దృష్టి కాంగ్రెస్( Congress party ) పై పడేలా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతోంది.

Telugu Brs Manifesto, Brs, Cm Kcr, Congress, Rahul Gandhi, Sonia Gandhi, Ts-Poli

ఇటీవల హైదరబాద్ లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల తరువాత ఐదు గ్యారెంటీలు ఐదు హామీలు అంటూ కొన్ని హామీలను ప్రకటించి ఒక్కసారిగా చర్చనీయాంశం అయింది.కాంగ్రెస్ ప్రకటించిన ఐదు హామీలు కర్నాటక మేనిఫెస్టోలోనివే అయినప్పటికి ఇక్కడి ప్రజలను కూడా ఆకర్షిస్తున్నాయి.మహిళలకు ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, మహిళలకు ప్రతి నెల రూ.2500, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు.ఇలా కొన్ని పథకాలను ప్రకటించింది హస్తం పార్టీ.ప్రస్తుతం హస్తం పార్టీ ప్రకటించిన ఈ హామీలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Telugu Brs Manifesto, Brs, Cm Kcr, Congress, Rahul Gandhi, Sonia Gandhi, Ts-Poli

ఓటర్లను ఆకర్శించేందుకే అమలు కానీ పథకాలను కాంగ్రెస్ ప్రకటిస్తోందని బి‌ఆర్‌ఎస్ విమర్శలు గుప్పిస్తున్నా.ఎంతో కొంత గులాబీ పార్టీలో ఆందోళన మొదలైనట్లే కనిపిస్తోంది.ప్రస్తుతం హస్తం పార్టీ ప్రకటించిన హామీలు ప్రజల్లోకి బలంగా వెళితే బి‌ఆర్‌ఎస్ కు గడ్డుకాలం ఏర్పడినట్లేనని కే‌సి‌ఆర్ భావిస్తున్నారట.అందుకే ఆలస్యం లేకుండా బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టోను కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారట కే‌సి‌ఆర్.

ఇప్పటికే మేనిఫెస్టోలో ఎవరు ఊహించని హామీలను గులాబీ బాస్ చేర్చరాని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.బి‌ఆర్‌ఎస్( BRS party ) మేనిఫెస్టో ప్రకటన తరువాత ఇతర పార్టీల మేనిఫెస్టోలు కనిపించవని గులాబీ పార్టీ నేతలు కాన్ఫిడెంట్ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం మేనిఫెస్టోతో చర్చనీయాంశం అయిన హస్తం పార్టీకి బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో తో చెక్ పెట్టె ఆలోచనలో గులాబీ బస్ ఉన్నారు.మరి త్వరలో ప్రకటించబోయే బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో తో కే‌సి‌ఆర్( CM KCR ) ఎలాంటి వ్యూహరచన చేశారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube