కవిత లిక్కర్ స్కామ్.. కే‌సి‌ఆర్ కు నష్టం తప్పదా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవితా లిక్కర్ స్కామ్( Kavitha Liquor Scam ) రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.ఈ స్కామ్ లో భాగంగా ఎమ్మెల్సీ కవితను ఎప్పటికే పలు మార్లు విచారించింది ఈడీ.

 Kavitha Liquor Scam.. Is Kcr Loss, Kavitha Liquor Scam, Bjp, Cm Kcr , Politics-TeluguStop.com

కానీ కేసు మాత్రం ఓ కొలిక్కి రావడం లేదు.కవిత ఎలాంటి స్కామ్ కు పాల్పడలేదని, కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగానే ఈ కేసులోకి కవితను లాగుతోందని బి‌ఆర్‌ఎస్ శ్రేణులు ఆరోపిస్తూనే ఉన్నారు.

అటు దర్యాప్తు సంస్థలు అనుసరిస్తున్న తీరుపై కవితా కూడా ఇప్పటికే పలు మార్లు కోర్టును ఆశ్రయించారు.ఇక ఇటీవల మరోసారి ఆమెకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

Telugu Brs, Cm Kcr, Congress, Kavithaliquor, Mlc Kavitha, Narendra Modi-Politics

అయితే ఈడీ( ED ) జారీ చేసిన నోటీసుల విషయంలో ఆమె ధర్మసనాన్నిఆశ్రయించింది.కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉద్దేశ పూర్వకంగా ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నాయని ఆమె పిటిషన్ లో పేర్కొంది.కాగా ఈ పిటిషన్ పై ఇవాళ విచరణ జరగాల్సి ఉండగా ప్రధాన జడ్జిలలో ఒకరు హాజరు కానందున ఈ కేసును వచ్చే నెల 20 వరకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది.అంతే కాకుండా తదుపరి విచారణ వరకు కవితకు ఎలాంటి సమన్లు జారీ చేయరాదని ఈడీని కూడా హెచ్చరించింది దర్మాసనం.

దీంతో ఆమెకు కొంత ఊరట లభించినట్లే.అయితే బీజేపీ నేతలు ఆరోపిస్తున్న ఆరోపణల ప్రకారం.

ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట.

Telugu Brs, Cm Kcr, Congress, Kavithaliquor, Mlc Kavitha, Narendra Modi-Politics

మరోవైపు ఎన్నికలకు కేవలం మూడు నెలలే సమయం ఉంది.ఈ నేపథ్యంలో ఒకవేళ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితా అరెస్ట్ అయితే బి‌ఆర్‌ఎస్ కు పెద్ద దేబ్బే అని చెప్పాలి.అసలే పార్టీలో ప్రస్తుత పరిస్థితులు ఆ పార్టీని తీవ్రంగా కలవర పరుస్తున్నాయి.

తొలి జాబితా అభ్యర్థుల ప్రకటన నుంచి పార్టీ విడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.మరోవైపు ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ బలంగా పుంజుకుంటుంది.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయితే బి‌ఆర్‌ఎస్( BRS party ) కు ఈసారి ఎన్నికల్లో భారీ షాక్ తగలడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.లిక్కర్ స్కామ్ లో కవిత నిర్ధోషి అని నిరూపించేందుకు కే‌సి‌ఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

మరి ఈ స్కామ్ నుంచి కవితా బయట పడుతుందా లేదా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube