ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై నవంబర్ 20కి విచారణ వాయిదా

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు మహిళల ఈడీ విచారణపై వేసిన పిటిషన్ విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.

 Hearing On Mlc Kavitha's Petition Adjourned To November 20-TeluguStop.com

ఈడీ దర్యాప్తు తీరును తప్పుబడుతూ తనకు ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.మహిళలను దర్యాప్తు సంస్థ కార్యాలయాల్లో కాకుండా ఇంటి వద్దనే విచారించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కవిత పిటిషన్ లో కోరారు.

ఇందుకు సంబంధించి తదుపరి విచారణను నవంబర్ 20 వ తేదీకి వాయిదా వేసింది.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద నమోదైన కేసులను నవంబర్ 11 నుంచి 18 వరకు సుప్రీంలోని ప్రత్యేక ధర్మాసనం విచారణ చేయనుంది.

తరువాత మహిళల ఈడీ విచారణకు సంబంధించిన అంశంపై నవంబర్ 20న విచారణ చేపట్టనుంది.ఈ క్రమంలో సుప్రీంలో మహిళల ఈడీ విచారణ కేసు ముగిసేంత వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో కవితకు ఎటువంటి సమన్లు ఇవ్వబోమని ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాదులు వెల్లడించారు.

దీంతో ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube