కరోనా భయం తో ఏకంగా ఆరువేల కోళ్ల ను సజీవంగా

కరోనా పుణ్యమా అని ప్రపంచదేశాలు వణికిపోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి సుమారు 4 వేల మంది మృతి చెందగా, లక్షల్లో బాధితులు చికిత్స పొందుతున్నారు.

 Karnataka Dejected Farmer Buried Thousands Of Chicken A Live-TeluguStop.com

చైనా లోని వూహన్ లో పుట్టిన ఈ మహమ్మారి ప్రపంచదేశాలకు పాకుతుంది.ఒక్క చైనా లోనే కాకుండా ఇరాన్,ఇటలీ ఇలా పలు దేశాల్లో ఈ కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

భారత్ లో కూడా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే భారత్ లో కూడా 62 కేసులు నమోదు కాగా భారత్ పౌల్ట్రీ రైతులపై కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

చికెన్ తింటే కరోనా వస్తుంది అంటూ పుకార్లు షికారు చేయడం తో భారీ గా చికెన్ సేల్స్ పడిపోయాయి.దీనితో పౌల్ట్రీ రైతులు బాగా నష్టపోతున్నారు.

దీనితో చికెన్ ధర భారీ గా పడిపోయింది.ప్రస్తుతం చికెన్ ధర కేజీ రూ.5 నుంచి రూ.10 వరకు అమ్ముడుపోతుంది అంటే దాని ధర ఎంతగా పడిపోయిందో అర్ధం అవుతుంది.అయితే కర్ణాటక కు చెందిన ఒక రైతు కరోనా భయం తో చేసిన పని ఇప్పుడు సంచలనం ఆ మారింది.

కర్ణాటకలోని గోకక్ తాలూకా లోలాసూర్ గ్రామానికి చెందిన నజీర్ అహ్మద్ అనే రైతు కరోనా వైరస్ వదంతులు కారణంగా చికెన్ సేల్స్ పడిపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై దాదాపు ఆరు వేల కోళ్లను గుంత తవ్వి సజీవంగా పూడ్చి పెట్టాడు.

దీనికి సంబందించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.దీనితో ఆ వీడియో చూసిన కొందరు ఆ రైతు పై మండిపడుతుండగా,మరి కొందరు అయ్యో పాపం అంటున్నారు.

మొత్తానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube