విక్రమ్ సినిమాలో అంధుడైన కమల్ హాసన్..అసలేమైంది..?

లోకనాయకుడు నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విక్రమ్ జూలై 16 న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది.ప్రస్తుతం ఈ  విక్రమ్ చిత్రం షూటింగ్ చురుగ్గా జరుగుతుంది విక్రమ్ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనకరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.

 Kamal Haasan, Who Was Blinded In Vikram Movie..is Original, Vikaram Movie , Losk-TeluguStop.com

పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్లో పూర్తి చేయాలని యోచిస్తున్నారు.విక్రమ్ మూవీ వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి రానుంది కాగా ఈ మూవీ ప్రధాన ముఖ్య అంశాలలో ఒకటిగా చెప్పబడుతున్న విషయం ఏమిటంటే.

కమల్ హాసన్ అంధుడిగా నటించబోతున్నారు.కమల్ పాత్ర నెట్టింట్లో ఈ వార్త ప్రచారంలో ఉంది.ఇంతకుముందు 1981లో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రాజా పార్త్వే చిత్రంలో  కమల్ హాసన్ ఆంధుడి పాత్రలో నటించారు.ఇప్పుడు మరోసారి అంధుడుగా నటించబోతున్నాడు.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి,  షాహిద్ ఫాసిల్ వంటి టాలెంట్ నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.త్వరలో ఫహద్ ఫాసిల్ షూటింగ్ లో చేరనున్నాడు.

విక్రమ్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండగా, సంగీతం యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నాడు.సినిమాటోగ్రఫీ గిరీష్ గంగాధరన్, ఎడిటర్ గా ఫిలోమిన్ రాజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube