ఒక భర్త తన భార్య అందంగా ఉండాలని కోరుకోవడం సహజం.అయితే అందమైన భార్య దొరికిన భర్తలు తమ పంట పండిందని అనుకుంటారు.
కానీ తన భార్య అందంతో అప్పుడప్పుడు సమస్యలు కూడా వస్తాయని వారు చాలా ఆలస్యంగా గ్రహిస్తారు.ఈ కోవలోకే తాజాగా ఓ సెలబ్రిటీ భర్త వచ్చి చేరాడు.
టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.ఆమె పెళ్లి చేసుకుందని తెలుసుకుని చాలా మంది ఆమె అభిమానులు దేవదాసులుగా మారానడంలో సందేహం లేదు.
అయితే కాజల్‌కు ఎలాంటి పాపులారిటీ ఉందో మనకు తెలుసు.
కానీ తన భార్యకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని తాజాగా నోరెళ్లబెట్టాడు కాజల్ భర్త గౌతమ్.
తాజాగా వరంగల్ పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు కాజల్ ముఖ్య అతిథిగా హాజరయ్యింది.అయితే కాజల్‌తో పాటు ఆమె భర్త గౌతమ్ కూడా అక్కడికి చేరుకున్నారు.
దీంతో కాజల్‌ను చూసేందుకు వరంగల్ ప్రజలు అక్కడి భారీ సంఖ్యలో చేరుకున్నారు.వారిని అదుపుచేయడం పోలీసుల తరం కాలేదు.
దీంతో అక్కడ కొంతసేపు తోపులాట కూడా చోటు చేసుకుంది.అయితే ఇదంతా అక్కడే ఉండి చూసిన గౌతమ్ ఒక్కసారిగా షాకయ్యాడట.
కాజల్‌కు తెలుగునాట ఇంత ఫాలోయింగ్ ఉందా అని ఆయన అనుకున్నాడట.
ఏదేమైనా తన భార్యకు కేవలం తెలుగునాటే కాకుండా యావత్ సౌత్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్‌లో కూడా అదిరిపోయే ఫాలోయింగ్ ఉందని గౌతమ్ ఎట్టకేలకు గ్రహించాడు.
ఇకపై కాజల్‌తో ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాలంటే గౌతమ్ కాస్తోకూస్తో భయపడటం మాత్రం ఖాయమని అంటున్నారు కాజల్ అభిమానులు.ఆమె ఫాలోయింగ్ రేంజ్ అలాంటి మరి.కాగా ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.